పిడుగుపాటుకు ఇద్దరి మహిళల మృతి
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:06 AM
జిల్లాలో పిడుగుపాటుకు గురై ఇద్దరు మహిళలు మృతి చెందారు.
కవిటి/పోలాకి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పిడుగుపాటుకు గురై ఇద్దరు మహిళలు మృతి చెందారు. కంచిలి మండలం జాడుపూడి గ్రామానికి చెందిన రెయ్య ఊర్వశి(39), పిలక హేమ, పిలక పుణ్యవతిలు కవిటి మండలం ఆర్.కరాపాడు వద్ద వరి చేలలో మంగళవారం మధ్యాహ్నం కలుపు తీస్తుండగా పిడుగు పడింది. దీంతో ఊర్వశి మృతి చెందగా, మిగిలిన ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. వీరు సోంపేట ఆస్పత్రిలో చికిత్స పొందు తున్నారు. భర్తతో విభేదాల కారణంగా ఊర్వశి తన పుట్టినిల్లు జాడుపూడిలో ఉంటుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ దుర్గారావు తెలిపారు. మంగళవారం సాయంత్రం పిడుగుపడి పోలాకి మండలం ఉరజాం గ్రామానికి చెందిన కణితి పద్మావతి(40) మృతి చెందింది. భర్త కృష్ణారావుతో కలిసి వరి పొలంలో కలుపు తీస్తుండగా పిడుగు పడడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రంజిత్ కేసు నమోదు చేశారు.

భార్య పద్మావతి మృతదేహం వద్ద భర్త కృష్ణారావు