రెండు పూరిళ్లు దగ్ధం
ABN , Publish Date - Dec 07 , 2025 | 11:58 PM
జీరుపాలెం గ్రామంలో ఆదివారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో మైలపల్లి కొర్లమ్మ, మైలపల్లి చిలకమ్మలకు చెందిన పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.
రణస్థలం, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): జీరుపాలెం గ్రామంలో ఆదివారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో మైలపల్లి కొర్లమ్మ, మైలపల్లి చిలకమ్మలకు చెందిన పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఈ ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. బాధితులను మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితుడు పిన్నింటి సాయికుమార్ తదితరులు పరామర్శించి, ఆర్థిక సాయం చేశారు.
పూసర్లపాడులో గడ్డికుప్ప..
గార, డిసెం బరు 7(ఆంధ్ర జ్యోతి): పూసర్ల పాడు గ్రామం వద్ద ఆదివారం ప్రమాదవ శాత్తూ అగ్ని ప్రమాదం జరిగి రైతు గదిలి సురేష్‌కు చెందిన మూడున్నర ఎకరాల్లో నూర్చిన గడ్డికుప్ప దగ్ధమైంది. ఇటీవల వరిని నూర్పి కుప్పగా పెట్టారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందో తెలియదు కాని వేలాది రూపాయల గడ్డి కాలిపోయిందని బాధితుడు తెలిపారు. తనను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.