డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు
ABN , Publish Date - Dec 04 , 2025 | 12:11 AM
నగరంలోని వేర్వేరు పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన ఇద్దరు వ్యక్తులకు బుధవారం సెకెండ్ క్లాస్ మేజిస్ర్టేట్ కోర్టు న్యాయాధికారి జైలుశిక్ష విధించారు.
శ్రీకాకుళం క్రైం, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): నగరంలోని వేర్వేరు పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన ఇద్దరు వ్యక్తులకు బుధవారం సెకెండ్ క్లాస్ మేజిస్ర్టేట్ కోర్టు న్యాయాధికారి జైలుశిక్ష విధించారు. వివరాలిలా ఉన్నాయి.. ఆమదాలవలస మండలం ఆనందపురం గ్రామానికి చెందిన రేవంత్ మంగళవారం మద్యం తాగి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడగా కేసు నమోదు చేసి న్యాయాధికారి శివరామకృష్ణ ముందు ప్రవేశపెట్టారు. ఈ మేరకు ఆయనకు న్యాయాధికారి ఐదు రోజుల జైలు శిక్ష విధించారు. అలాగే సారవకోట మండలం కుమ్మరిగుంట గ్రామానికి చెందిన నాసు శివశంకర్ మద్యంతాగి వాహనం నడిపి నగరంలోని టూటౌన్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడికి డ్రంకెన్ డ్రైవ్ పరీక్ష నిర్వహించి కేసు నమోదు చేసి సెకెండ్ క్లాస్ మేజిస్ర్టేట్ కోర్టు న్యాయాధికారి శివరామకృష్ణ ఎదుట హాజరు పరచగా ఐదు రోజుల జైలుశిక్ష విధించినట్టు ట్రాఫిక్ సీఐ రామారావు తెలిపారు.