Share News

హెచ్‌సీపై దాడి చేసిన ఇద్దరికి జైలుశిక్ష

ABN , Publish Date - May 31 , 2025 | 11:29 PM

హెడ్‌ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులకు శ్రీకాకుళం సెకండ్‌ క్లాస్‌ జ్యుడీషియల్‌ న్యాయాధికారి శివరామకృష్ణ 20 రోజుల శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు శ్రీకాకుళం టౌన్‌ సీఐ పి.పైడపునాయుడు తెలిపారు.

 హెచ్‌సీపై దాడి చేసిన ఇద్దరికి జైలుశిక్ష

శ్రీకాకుళం క్రైం, మే 31 (ఆంధ్రజ్యోతి): హెడ్‌ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులకు శ్రీకాకుళం సెకండ్‌ క్లాస్‌ జ్యుడీషియల్‌ న్యాయాధికారి శివరామకృష్ణ 20 రోజుల శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు శ్రీకాకుళం టౌన్‌ సీఐ పి.పైడపునాయుడు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. స్థానిక మంగువారి తోటలో నివాసం ఉంటున్న పొన్నాడ త్రినాథరావు హెడ్‌ కానిస్టేబుల్‌గా (ప్రస్తుతం శ్రీకాకుళం డీసీ ఆర్‌బీ) పనిచేస్తున్నారు. మే 29న రాత్రి 7.20 గంటల సమయంలో ఇంటికి మోటార్‌ సైకిల్‌పై వెళుతున్నారు. ఈ సమ యంలో లెపర్సీ కాలనీ జంక్షన్‌ వద్ద బోడెమ్మ కోవెల వీధికి చెందిన వెల్లంపూడి రాజేష్‌, దమ్మల వీధికి చెందిన పొట్నూరు వాసు బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తూ దారిని పోయే వారిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తుండగా గమనించిన హెచ్‌సీ త్రినా ఽథరావు మీరు చేస్తున్న పని తప్పని వారించగా మద్యం మత్తులో ఉన్న ఆ ఇద్దరు కలిసి అతనిపై చేతులతో దాడి చేశారు. రక్తం కారినట్లు గాయ పరిచారు. సమాచారం తెలుసుకున్న శ్రీకాకుళం ఒకటో పట్టణ ఎస్‌ఐ బి. రామారావు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపు లోకి తీసుకున్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ను బ్రీత్‌ ఎనలైజర్‌ ద్వారా పరీక్షించగా ఇరువురు మద్యం సేవించినట్టు నిర్ధారణ కావడంతో వారిని శ్రీకాకుళం సెకండ్‌ క్లాస్‌ జ్యుడీషియల్‌ మేజిస్ర్టేట్‌ కోర్టులో హాజరుపరిచారు. న్యాయా ధికారి శివరామకృష్ణ ఒక్కొక్కరికి 20 రోజులు చొప్పున జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడంతో జిల్లా జైలుకు తరలించినట్లు సీఐ తెలిపారు.

పేకాట శిబిరంపై పోలీసుల దాడి

8 మంది అరెస్టు, రూ.1.42 లక్షలు స్వాధీనం

పలాస, మే 31(ఆంధ్రజ్యోతి): పలాస మండలం తర్లాకోట గ్రామ సరి హద్దులో పేకాట శిబిరంపై శనివారం ఎస్‌ఐ నర్సింహమూర్తి, సిబ్బంది దాడి చేశారు. ఇందులో 8 మందిని పట్టుకుని వారి నుంచి రూ.1.42 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

దొంగతనం కేసులో వ్యక్తి అరెస్టు

శ్రీకాకుళం క్రైం, మే 31(ఆంధ్రజ్యోతి): నగరంలోని బాకర్‌సాహెబ్‌ పేటలో ఓ ఇంటిలో బీరువా నుంచి రూ.25 వేలు నగదు అపహరించిన కేసులో ఇద్దరిలో ఒక వ్యక్తిని అరెస్ట్‌ చేసి నట్లు టూటౌన్‌ సీఐ ఈశ్వరరావు శనివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఈనెల 28న మధ్యాహ్నం ఇంటి తలుపులు బద్దలు కొట్టి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలోకి ప్రవేశించి తన బెడ్‌ రూమ్‌ బీరువాలో ఉన్న రూ.25 వేలు నగదును దొంగిలిం చినట్టు బాకర్‌సాహెబ్‌పేటకు చెందిన బంటు పల్లి భానుప్రకాష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్‌ సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను గుర్తించగా వారిలో విశాఖపట్నం పెద్దవాల్తేరు జాలరిపేటకు చెందిన మజ్జి జస్వంత్‌ను అదుపులోకి తీసుకొని విచారించినట్టు తెలిపారు. మరో వ్యక్తి, అతని స్నేహితుడు భాను ప్రకాష్‌గా గుర్తించామని, అతడు పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు. మజ్జి జస్వంత్‌ను రిమాండ్‌కు తరలించామన్నారు. ఇతడి పై విశాఖపట్నం, ఏలూరుల్లో పలు కేసులు ఉన్నట్లు సీఐ ఈశ్వరరావు తెలిపారు.

సారా తరలిస్తున్న ఆరుగురి అరెస్ట్‌

హరిపురం, మే 31(ఆంధ్రజ్యోతి): మందస మండలంలో వివిధ గ్రామాల్లో సారా తరలిస్తు పట్టుబడిన ఆరుగురు నిందితులను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజ రుపరిచినట్లు ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ సీఐ బేబీ శనివారం ఒక ప్రకటనలో తెలి పారు. మందస మండలంలో ఇటీవల చేసి న దాడుల్లో వివిధ గ్రామాల్లో పలువురిని అరెస్ట్‌ చేశామని చెప్పారు. సారా రవా ణా, తయారీపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - May 31 , 2025 | 11:29 PM