చీటింగ్ కేసులో ఇద్దరికి రిమాండ్
ABN , Publish Date - Oct 09 , 2025 | 12:44 AM
చీటింగ్ కేసులో ఇద్దరికి కోర్టు రిమాండ్ విధించినట్టు ఎస్‌ఐ కె.మధుసూదనరావు తెలిపారు.
పాతపట్నం, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): చీటింగ్ కేసులో ఇద్దరికి కోర్టు రిమాండ్ విధించినట్టు ఎస్‌ఐ కె.మధుసూదనరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. స్థానిక శాంతినగర్‌కు చెందిన చెల్లి శ్రీనివాసరావుకు మండల పరిధిలోని చిన్నపద్మాపురం గ్రామానికి చెందిన బాడాన వెంకటరావు, సారవకోట మండల పరిధిలోని గోవర్ధనపురం గ్రామానికి చెందిన జోగి రమేష్ ఓ ల్యాండ్‌కు సంబం ధించి తప్పుడు పత్రాలను సృష్టించిన అమ్మజూపారు. ఇందులో భాగంగా శ్రీనివా సరావు నుంచి కొంత మొత్తాన్ని అడ్వాన్స్‌గా తీసుకున్నారు. మోసపోయినట్టు తెలుసుకున్న శ్రీనివాసరావు తన డబ్బులు ఇవ్వాలని వారిని అడిగాడు. వారిద్దరూ తమ స్నేహితుడైన టెక్కలి మండలం లింగాలవలస గ్రామానికి చెందిన యడ్ల గోపితోపాటు మరికొంత మందితో శ్రీనివాసరావును బెదిరించారు. శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితులు బాడాన వెంకటరావు, జోగి రమేష్‌లను మంగళవారం సాయంత్రం అరెస్టు చేసి స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో బుధవారం హాజరుపరచగా.. 14రోజులు రిమాండ్‌ను విధించినట్టు ఎస్‌ఐ మధుసూదనరావు తెలిపారు.