Share News

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

ABN , Publish Date - Aug 29 , 2025 | 12:22 AM

జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

రణస్థలం, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దన్నానపేట సమీపం లో జరిగిన ప్రమాదం లో లావేరు మండలం కొత్తకుంకాం గ్రామానికి చెందిన బి.శిరీష (22) మృతి చెందింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు జేఆర్‌పురం వేంకటేశ్వర కాలనీలో ఉంటున్న అ మ్మమ్మ ఇంటికి ఆటోలో శిరీష వెళుతోంది. దన్నానపేట వద్ద యూటర్న్‌ తీసుకుంటున్న సమయంలో గుర్తు తెలి యని వాహనం ఢీకొనడంతో ఆటో బోల్తా పడింది. దీం తో శిరీష అక్కడికక్కడే మృతి చెందింది. ఇదిలా ఉండ గా మరో ప్రమాదంలో లావేరు మండలం సుభద్రాపు రం గ్రామానికి చెందిన వి.ప్రభాస్‌ (20) మృతి చెం దాడు. జేఆర్‌పు రం నుంచి సీతంవలస మీదుగా ద్విచక్ర వాహనంపై వి.ప్రభాస్‌, రాంబాబు వెళుతున్నారు. సీతంవలస గ్రామానికి సమీపంలో వీరి వాహనం అదుపు తప్పింది. దీంతో కిందపడిన ప్రభాస్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. రాంబాబుకు గాయాలయ్యాయి. ఈ రెండు సంఘటనలకు సంబంధించి కేసు నమోదు చేసినట్టు జేఆర్‌పురం ఎస్‌ఐ ఎస్‌ చిరంజీవి తెలిపారు.

చికిత్స పొందుతూ వ్యక్తి..

జలుమూరు, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): జలుమూరు గ్రామానికి చెందిన పులి వెంకటరావు (37) గడ్డిమందు తాగి శ్రీకాకుళం రిమ్స్‌ లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మద్యానికి బానిసైన వెంకటరావు అనారోగ్యంతో బాధపడుతూ మనస్తాపానికి గురై ఈ నెల 9న గడ్డి మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందాడు. తండ్రి శివరాం ఎనిమిదేళ్ల కిందట మృతిచెందగా తల్లి సావిత్రి ఉంది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బి.అశోక్‌బాబు తెలిపారు.

విద్యుదాఘాతంతో రైతు..

పలాసరూరల్‌, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): పలాస మం డలం గోపాలపురం గ్రామానికి చెందిన రైతు యవ్వారి వైకుంఠరావు(62) విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేర కు.. వైకుంఠరావు పొలంలో నీటిని పరిశీలించేందుకు గు రువారం మధ్యాహ్నం 12గంటల సమయంలో వెళ్లాడు. ఈ క్రమంలో మోటారు షెడ్‌ వద్ద విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. పొలానికి వెళ్లిన తన భర్త ఎంతకీ రాకపోవడంతో భార్య ఉషారాణి, బంధువులతో కలిసి పొలానికి చేరుకొని చూడగా వైకుంఠరావు విద్యుత్‌షాక్‌కు గురై పడి ఉన్నాడు. వెంటనే వారు పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించ గా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. వైకుంఠరావుకి కుమా రుడు సాయితేజ్‌, కుమార్తె నవ్య ఉన్నారు. ఏఎస్‌ఐ ఆనందరావు కేసు నమోదు చేశారు.

గుర్తు తెలియని రైలు ఢీకొని వ్యక్తి..

కోటబొమ్మాళి, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): హరిశ్చంద్రపు రం రైలు నిలయం సమీపంలో గురువారం ఉదయం గుర్తుతెలియని రైలు ఢీకొని సరియా బొడ్డపాడు గ్రామాని కి చెందిన చాప రాములు(55) మృతి చెందినట్టు పలాస జీఆర్పీ హెచ్‌సీ మెట్ట సోమేశ్వరరావు తెలిపారు. మృతదే హాన్ని టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రితో పోస్టుమార్టం నిర్వ హించి కుటుంబసభ్యులు అప్పజెప్పినట్టు జీఆర్పీ హెచ్‌సీ ఎలిపారు. కాగా రాములుకి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

Updated Date - Aug 29 , 2025 | 12:22 AM