వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
ABN , Publish Date - Jun 06 , 2025 | 12:01 AM
జిల్లాలో గురువారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. బూర్జ మండలం లాభాం సమీపంలో ఓ విద్యార్థిని, నందిగాం మండలం పెద్ద బాణాపురం సమీపంలో మినీ వ్యాన్ డ్రైవర్ మృత్యువాతపడ్డారు.
జిల్లాలో గురువారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. బూర్జ మండలం లాభాం సమీపంలో ఓ విద్యార్థిని, నందిగాం మండలం పెద్ద బాణాపురం సమీపంలో మినీ వ్యాన్ డ్రైవర్ మృత్యువాతపడ్డారు.
లాభాం వద్ద ట్రాక్టర్‌ను తప్పించబోయి విద్యార్థిని..
బూర్జ, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): మండ లంలోని లాభాం గ్రామ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 9వ తరగతి విద్యార్థిని మృతి చెందగా, ఆమె తండ్రికి తీవ్ర గాయా లైనట్లు ఎస్‌ఐ మొజ్జాడ ప్రవల్లిక తెలిపారు. పోలీసులు తెలిపిన వివరా లిలా ఉన్నాయి. ఆమదాలవలస పట్టణం ఐజే నాయుడు కాలనీకి చెందిన కాయల కేతన, తండ్రి కాళి దాసుతో కలిసి ద్విచక్ర వాహనంపై గుత్తావిల్లి నుంచి రాజాం పని నిమిత్తం వెళుతూ అదే సమయంలో ముందు వెళ్తున్న ఇటుకల ట్రాక్టర్‌ను తప్పించబోయి ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడడంతో తలకు బలమైన గాయం తగిలి కేతన అక్కడి కక్కడే మృతి చెందింది. తండ్రి కాళిదాసుకు భుజం మీదుగా ట్రాక్టర్ చక్రం వెళడంతో తీవ్రగాయాలు కాగా 108లో శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తు న్నారు. మృతురాలి తల్లి శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తుండగా తండ్రి చిరు వ్యాపారం చేస్తూ జీవనం సాగి స్తున్నారు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ ప్రవల్లిక సిబ్బందితో కలిసి పరిశీలిం చారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
పెద్ద బాణాపురంలో లగేజీ వ్యాన్ డ్రైవర్..
నందిగాం, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): పెద్దబాణా పురం సమీపంలో జాతీ య రహదారిపై గురు వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మినీ లగేజ్ వ్యాన్ డ్రైవర్ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి.. తెలంగాణా రాష్ట్రం నల్లగొండ జిల్లా హనుమా పూర్ గ్రామానికి చెందిన వంగేటి సురేందర్ రెడ్డి (38) హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ టీవీ మెటీ రియల్‌తో టెక్కలి నుంచి పలాస వైపు వ్యాన్‌తో వెళ్తుండగా పెద్ద బాణా పురం సమీపంలో ముందుగా వెళ్తున్న ట్రాక్టర్‌ను బలంగా ఢీకొంది. దీంతో డ్రైవర్ క్యాబిన్‌లో చిక్కుకున్నాడు. వెంటనే పోలీసులు, వాహన చోదకులు, హైవే అంబులెన్స్ సిబ్బంది శ్రమించి బయటకు తీసి చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. నందిగాం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.