Share News

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

ABN , Publish Date - May 06 , 2025 | 11:42 PM

జిల్లాలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఒక వ్యక్తి గాయపడ్డారు.

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
జి.సిగడాం: ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ మధుసూదనరావు

జిల్లాలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఒక వ్యక్తి గాయపడ్డారు.

వ్యాన్‌-బైక్‌ ఢీ ఒకరు మృతి

జి.సిగడాం, మే 6 (ఆంధ్ర జ్యోతి): ఉల్లివలస కూడలి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయ నగరం జిల్లా మెరకముడిదాం మండలం పూతికవలస గ్రామానికి చెందిన గురాన అప్పలనాయుడు(37) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. రాజాం నుంచి విశాఖపట్నం వెళు తున్న లగేజీ వ్యాన్‌, చీపురుపల్లి నుంచి పూతికవలసకి వెళుతున్న ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. తన స్వగ్రామం పూతికవలస ద్విచక్రవాహనంపై వెళుతున్న అప్పలనాయుడుని వ్యాన్‌ బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు తాపీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు, మృతుడికి భార్య వరలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శవ పంచనాచా చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ వై.మధుసూదనరావు తెలిపారు. వ్యాన్‌ డ్రైవర్‌ రాజాం మండలం కొఠారిపురం గ్రామానికి చెందిన గిరిజాల ఈశ్వరరావుగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి

కుమారుడికి గాయాలు జర్జంగి వద్ద ఘటన

టెక్కలి/జలుమూరు, మే 6(ఆంధ్రజ్యోతి): కోటబొమ్మాళి మండలం జర్జంగి సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. జలుమూరు మండలం బసివాడ గ్రామానికి చెందిన బుద్దల సింహాచలం (43), కుమారుడు జగన్మోహన్‌రావు సంతబొ మ్మాళి బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు. ఆ సమయంలో నరసన్నపేట నుంచి టెక్కలి వైపు చిప్స్‌ లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ శ్రీజగన్నాథపురం వెళ్లేందుకు జర్జంగి సమీపంలో ఎటువంటి సిగ్నల్‌ ఇవ్వకుండా యూటర్న్‌ తీసుకుని ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో కోటబొమ్మాళి సీహెచ్‌సీకి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సింహాచలం మృతి చెందాడు. కుమారుడు చికి త్స పొందుతున్నాడు. ఈ మేరకు కోటబొమ్మాళి ఎస్‌ఐ సత్యనారాయణ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య రమణమ్మ, కుమారుడు, కుమార్తె భవాని ఉన్నారు. కుమారుడు పాలిటెక్నిక్‌, కుమార్తె 9వ తరగతి చదువుతోంది. సింహాచలం మృతి చెందిన విషయం తెలుసుకుని బసివలసలో విషాదఛాయలు అలముకున్నాయి.

Updated Date - May 06 , 2025 | 11:42 PM