Share News

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

ABN , Publish Date - Dec 04 , 2025 | 12:09 AM

పోలీస్‌ క్వార్టర్స్‌ వద్ద పాత జాతీయ రహ దారిపై బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డా రు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

ఎచ్చెర్ల, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): పోలీస్‌ క్వార్టర్స్‌ వద్ద పాత జాతీయ రహ దారిపై బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డా రు. సిగ్వీలో పనిచేస్తున్న లావేరు మండలం పెదలింగాలవలసకి చెందిన చందన గణేష్‌, అంబేడ్కర్‌ వర్సిటీలో బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్న కొత్తూరు మండలం కడుమ గ్రామానికి పాలిశెట్టి చందు మోటార్‌ బైక్‌పై ఎచ్చెర్ల నుంచి శ్రీకాకుళం వస్తుండగా ఏఆర్‌ కార్యాలయం వద్దకు వచ్చే సరికి డివైడర్‌ను బలం గా ఢీకొట్టారు. దీంతో బైక్‌ టైర్‌ పేలి రోడ్డుపై పడి గాయాలయ్యాయి. ఈ ఘట నలో వెనుక కూర్చున్న చందు కాలు విరిగిపోగా, బైక్‌ నడుపుతున్న గణేష్‌ తలకు తీవ్ర గాయమైంది. వెంటనే చికిత్స నిమిత్తం ఏపీఎస్‌పీ బెటాలియన్‌ వాహనంలో శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లగేజీ ఆటో బోల్తాపడి ఒకరు..

పాతపట్నం, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): మండల పరిధి సొద గ్రామ కూడలి చేరువలో బుధవారం సాయంత్రం ఓ లగేజీ ఆటో బోల్తాపడిన ఘటనలో బేరింగి యశ్వంత్‌ అనే యువకుడు గాయపడ్డాడు. పోలీసులు వివరాల మేరకు.. ఏఎస్‌ మణుగు పంచాయతీలోని సంతోషపురం గ్రామానికి చెందిన యశ్వంత్‌ కొమనాప ల్లి కాలనీకు లగేజీ ఆటోలో సామగ్రితో వెళ్లి తిరిగివస్తుండగా సొద గ్రామ చేరువలో కూడలి వద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న యశ్వంత్‌ గాయపడడంతో చికిత్స నిమిత్తం స్థానిక సీహెచ్‌సీకు తరలించారు. యశ్వంత్‌ పిన్ని బిడ్డికి సుజాత ఇచ్చిన ఫిర్యాదుమేరకు హెచ్‌ిసీ సీహెచ్‌ వెంకటరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Dec 04 , 2025 | 12:09 AM