Share News

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

ABN , Publish Date - May 01 , 2025 | 11:59 PM

మునిసిపాలిటీ పరిధిలోగల వీకేపేట రోడ్డులో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ తోపాటు ద్విచక్రవాహనంపై వస్తున్న మహిళకు కూడా తీవ్ర గాయాల య్యాయి.

 రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
ఘటనా స్థలంలో ట్రాక్టర్‌

ఇచ్ఛాపురం, మే 1(ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీ పరిధిలోగల వీకేపేట రోడ్డులో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ తోపాటు ద్విచక్రవాహనంపై వస్తున్న మహిళకు కూడా తీవ్ర గాయాల య్యాయి. స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని పెద్ద ఆకులవీధికి చెంది న కిల్లంశెట్టి శరణ్య ద్విచక్రవాహనంపై రత్తకన్న వైపు వెళ్తోంది. అదే సమ యంలో రత్తకన్న నుంచి ఇచ్ఛాపురం వైపు కవిటి మండలానికి చెందిన సవ రాశి దుదిష్టి ట్రాక్టర్‌ నడుపుకొంటూ వస్తున్నాడు. ఆ సమయంలో ద్విచక్ర వా హనాన్ని ఢీకొట్టి రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి ట్రాక్టర్‌ దూసుకెళ్లింది. దీం తో శరణ్య, ట్రాక్టర్‌ డ్రైవర్‌ దుదిష్టికి గాయాలుకావడంతో 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం బరంపురం తరలించారు. పట్టణ ఎస్‌ఐ ముకుంద రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - May 01 , 2025 | 11:59 PM