road accident రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
ABN , Publish Date - Apr 30 , 2025 | 11:55 PM
road accident చిన్ననీలావతి గ్రామం సమీపంలో జాతీ య రహదారిపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామా నికి చెందిన సొర్ర గణపతి, సొర్ర తంబ య్యలకు తీవ్ర గాయాలయ్యాయి.
పలాస, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): చిన్ననీలావతి గ్రామం సమీపంలో జాతీ య రహదారిపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామా నికి చెందిన సొర్ర గణపతి, సొర్ర తంబ య్యలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీ సులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ద్విచక్ర వాహనంపై వెళు తున్న వీరిని వెనుక నుంచి గుడ్లు తరలి స్తున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే క్షత గాత్రులను హైవే అంబులెన్స్‌లో పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి నిల కడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సుభద్రాపురం సమీపంలో..
నందిగాం, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): సుభద్రాపురం గ్రామ సమీప జాతీ య రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన దుక్క కృష్ణారావుకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. కృష్ణారావు ఉపాధి పనికి వెళ్లేందుకు ఇంటి నుంచి నంది గాం వచ్చే మార్గంలో నడుచుకుంటూ వస్తుండగా అదే మార్గంలో రాంగ్ రూట్‌లో వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొంది. దీంతో కృష్ణారావు ఎడమకాలు విరిగిపోగా శరీరంపై పలుచోట్ల గాయాలయ్యాయ. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి హైవే అంబులెన్స్‌లో తరలించారు. నందిగాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ఢీకొని..
నరసన్నపేట, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): ఉర్లాం రైల్వేస్టేషన్ వద్ద ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ఢీకొనికొత్తపొలవలసకు చెందిన తలగాన గోవిందరావు తీవ్రంగా గాయపడినట్లు రైల్వే పోలీసు అధికారి మధుసూదనరావు తెలిపారు. బుధవారం ఉదయం పట్టాలు దాటుతున్న సమయంలో ఈప్రమాదం జరిగిందని, వెంటనే క్షతగాత్రుడిని 108 వాహనంలో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో చేర్పించడం జరిగిందన్నారు. ఈతడు అపస్మారక స్థితిలో ఉన్నట్లు జీఆర్‌పీ హెచ్‌సీ తెలిపారు. ప్రమాదం జరిగిన తీరుపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.