రెండు కార్లు ఢీ: తప్పిన ప్రమాదం
ABN , Publish Date - Jun 15 , 2025 | 11:21 PM
కొత్తూరు-పాలకొండ మార్గంలో ఆది వారం ఉదయం రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో రెం డూ నుజ్జునుజ్జయ్యాయి. అయితే కారులో ఉన్నవారు చిన్న చిన్న గాయా లతో బయటపడ్డారు.

కొత్తూరు, జూన్ 15(ఆంధ్రజ్యోతి): కొత్తూరు-పాలకొండ మార్గంలో ఆది వారం ఉదయం రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో రెం డూ నుజ్జునుజ్జయ్యాయి. అయితే కారులో ఉన్నవారు చిన్న చిన్న గాయా లతో బయటపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కొత్తూ రుకు చెందిన ప్రైవేటు డెంటల్ వైద్యుడు కొత్తూరు నుంచి పాలకొండ వైపు వెళుతుండగా, పాలకొండ నుంచి కొత్తూరు వైపు వస్తున్న కారు ఢీకొన్నాయి. కార్లలో ఉన్న బెలూన్ ఓపెన్ కావడంతో ప్రాణా పాయం నుంచి బయట పడ్డారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడిన వారు స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నట్లు తెలి సింది. అయితే రెండుకార్ల యజమానులు పోలీసులకు ఎటువంటి ఫిర్యా దు చేయలేదు. ఈ విషయమై ఎస్‌ఐ ఎండీ అమీర్ ఆలీ వద్ద ప్రస్తా వించగా పాలకొండ మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు.
రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరికి గాయాలు
కొత్తూరు, జూన్ 15(ఆంధ్రజ్యోతి): కొత్తూరు మండలం గూనభద్ర వద్ద ఆదివారం రాత్రి మెట్టూరు వైపు వెళుతున్న బైక్‌ను వెనుక నుంచి వచ్చిన మరో బైక్ ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. టీవీస్ ఎక్స్‌ఎల్ నడుపుతున్న పెద్దకోట శిమ్మన్న, పల్సర్ వెనుక కూర్చున్న ఎడ్ల సంజీవ రావుకు తీవ్ర గాయాలయ్యాయి. పెదకోట కృష్ణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నట్లు ఎస్‌ఐ ఎండీఅమీర్ ఆలీ తెలిపారు.
10 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
నరసన్నపేట, జూన్ 15(ఆంధ్రజ్యోతి): నరసన్నపేట మండలం దేవాది గ్రామం వద్ద ఓ చెరువు గట్టుపై ఆదివారం పేకాట ఆడుతున్న 10 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ తెలి పారు. గ్రామ శివారులో చెరువు గట్టుపై పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడి చేసి 10 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. రూ. 6,850 నగదుతో సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
బీచ్‌లో మృతదేహం గుర్తింపు
సోంపేట, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): గొల్లగండి సమీపంలోని బీచ్‌లో సోంపేట జాలారి వీధికి చెందిన కాశి కూర్మారావు మృతదేహం ఆదివారం సాయంత్రం గుర్తించారు. సాయంత్రం పలువురు మత్స్యకారులు మృత దేహాన్ని గమనించి, మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు. వారు బారువ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో ఏఎస్‌ఐ కృష్ణ ఆధ్వర్యంలో కేసు నమోదుచేశారు. మృతుడు పెయింటింగ్ పనులు చేసి జీవిస్తున్నాడు. కూర్మారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
చికిత్స పొందుతూ కానిస్టేబుల్ మృతి
సోంపేట, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): ఇచ్ఛా పురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పొట్టి జగదీష్ ఆదివారం చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. సోంపేట మండ లంలోని ఎర్ర ముక్కాం గ్రామానికి చెందిన పొట్టి జగదీష్ శని వారం టెక్కలి జాతీయ రహదారి వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో శీకాకుళం రిమ్స్‌కు తరలించగా ఆదివారం మృతి చెందాడు. జగదీష్‌కు భార్య పుష్ప, కుమారుడు సాయి ఉన్నారు.