Share News

గంజాయితో ఇద్దరి అరెస్టు

ABN , Publish Date - Dec 06 , 2025 | 12:18 AM

గంజాయితో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టు సీఐ ఎం.శ్రీనివాసరావు తెలిపారు.

గంజాయితో ఇద్దరి అరెస్టు

నరసన్నపేట, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): గంజాయితో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టు సీఐ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం స్థానిక మడపాం టోల్‌ప్లాజా వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. బరంపురం నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న లారీలో ఇద్దరు వ్యక్తులు బ్యాగ్‌లో ఎనిమిది కిలోల గంజాయితో పట్టుబడ్డారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన శుభమ్‌ గౌడ, దీపక్‌ మాత్రిలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ తెలిపారు.

Updated Date - Dec 06 , 2025 | 12:18 AM