దొంగతనం కేసులో ఇద్దరి అరెస్టు
ABN , Publish Date - Nov 01 , 2025 | 12:18 AM
బుడితి గ్రామంలో ఈనెల 28న జరిగిన దొంగతనం కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, అరతులం బంగారం రికవరీ చేసినట్టు నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు తెలిపారు.
జలుమూరు(సారవకోట), అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): బుడితి గ్రామంలో ఈనెల 28న జరిగిన దొంగతనం కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, అరతులం బంగారం రికవరీ చేసినట్టు నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం బొంతు జంక్షన్‌లో దొంగతనానికి పాల్పడిన చీడిపూడి గ్రామానికి చెందిన రావాడ దేవిశ్రీ ప్రసాద్, జలుమూరు మండలం నామానపేటకు చెందిన తీయల గోపి (కోటి)లను అరెస్టు చేశారు. వీరిద్దరూ చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలు చేస్తూ జల్సా చేస్తున్నారు. ఈ క్రమంలో బుడితి గ్రామం పెద్దవీధిలో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలు నిక్కు చెల్లెమ్మ ఇంటిలో చొరబడి ఆమెను బెదిరించి ముక్కు, చెవికి ఉన్న బంగారం ఆభరణాలు దోచుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకున్నారు. ఎస్‌ఐ అనిల్‌కుమార్, పోలీసు సిబ్బంది ఉన్నారు.