పెండింగ్ కేసుల రాజీకి యత్నించండి
ABN , Publish Date - Nov 15 , 2025 | 11:47 PM
సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు రాజీ అయ్యేలా ప్రయత్నించాలని మండల న్యాయసేవాధికార సంస్థ చైర్ పర్సన్, జూనియర్ సివిల్ న్యాయాధికారి ఎస్.వాణి సూచించారు.
నరసన్నపేట, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు రాజీ అయ్యేలా ప్రయత్నించాలని మండల న్యాయసేవాధికార సంస్థ చైర్ పర్సన్, జూనియర్ సివిల్ న్యాయాధికారి ఎస్.వాణి సూచించారు. శనివారం స్థానిక కోర్టు ప్రాంగణంలో పోలాకి, నరసన్నపేట, ఎక్సైజ్ స్టేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 13వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా క్షక్షిదారులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యాక్రమంలో ఏపీపీ ఆర్‌ఎస్ సంతోషి, ఏజీపీ వి.శ్రీనివాసరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రావాడ కొండలరావు, న్యాయవాదులు టి.మధుసూదనరావు, డి.ప్రశాంతి, గొండు అప్పారావు, సీఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్‌ఐలు దుర్గాప్రసాద్, రంజిత్, ఎక్సైజ్ ఎస్‌ఐ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.