లక్ష్యాలు సాధించేలా ప్రయత్నించాలి
ABN , Publish Date - Nov 10 , 2025 | 12:11 AM
ఉన్నత లక్ష్యాలు అధిరోహిం చాలంటే కఠోర సాధ న ఎంతో అవసరమని పర్వతారోహణలో రికా ర్డు సాధించిన మేజర్ వాసుపత్లి కవిత అ న్నారు.
పర్వతారోహకురాలు, ఆర్మీ మేజర్ కవిత
వజ్రపుకొత్తూరు, నవంబరు 9(ఆంధ్ర జ్యోతి): ఉన్నత లక్ష్యాలు అధిరోహిం చాలంటే కఠోర సాధ న ఎంతో అవసరమని పర్వతారోహణలో రికా ర్డు సాధించిన మేజర్ వాసుపత్లి కవిత అ న్నారు. ఆదివారం సాయంత్రం మెట్టూరులో గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ.. 6,488 మీటర్లు ఎతైన మౌంట్‌గోరిచెన్ శిఖరాన్ని అధిరో హించే సహయంలోను, అలాగే బ్రహ్మపుత్ర నది ప్రవాహం రాప్ట్ చేసిన సమ యంలో తన అనుభవాలను వివరించారు. చిన్న వయస్సులో ఆర్మీలో డాక్టర్‌గా చేరినట్టు తెలిపారు. ధైర్య సాహసాలతో ప్రపంచ రికార్టు సాధించినట్టు ఆమె వివరించారు. అనంతరం కవిత తల్లిదండ్రులు వాసుపల్లి రామారావు, రమ్య దంపతులను ఘనంగా సన్మానించారు.