తుఫాన్ తర్వాత సమస్యలు లేకుండా చర్యలు
ABN , Publish Date - Oct 28 , 2025 | 11:52 PM
మొంథా తుఫాన్ తర్వాత సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని తుఫాన్ ప్రత్యేకాధికారి కేవీ ఎన్.చక్రధర్‌బాబు ఆదేశించారు.
అరసవల్లి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ తర్వాత సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని తుఫాన్ ప్రత్యేకాధికారి కేవీ ఎన్.చక్రధర్‌బాబు ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళ వారం ఇన్‌చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌తో కలిసి వివిధ శాఖల జల వనరులు డ్యామ్‌లు, కాలువల పరిస్థితిపై సమీక్షించారు. తుఫాన్ తర్వాత ప్రజలు తాగే నీటిని క్లోరినేషన్ తప్పనిసరిగా చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈని ఆదేశించారు. బహుదానది మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు జలవనరులశాఖ ఎస్‌ఈ పి.సుధాకర్ తెలిపారు. వచ్చే వరద ప్రవాహంపై ఆయనను చక్రధర్ బాబు అడిగి తెలుసుకున్నారు. అలాగే మేజర్ ఇరిగేషన్ పరిస్థితిపై ఆరా తీశారు. గొట్టాబ్యారేజ్‌లో నీటి ప్రవాహ పరిస్థితి, నిలువ లపై అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, డీఆర్వో ఎం.వేంకటేశ్వరరావు, ఎస్‌ఈలు తదితరులు పాల్గొన్నారు.