Share News

పవర్‌ ప్లాంట్‌ సర్వేను అడ్డుకున్న గిరిజనులు

ABN , Publish Date - Sep 11 , 2025 | 11:58 PM

:సరుబుజ్జిలి, బూర్జ మం డలాల సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ డీపీఆర్‌ సర్వేను గిరిజనులు అడ్డుకున్నారు. గురు వారంసాయంత్రం సరుబుజ్జిలి మండలంలోని వెన్నెలవలస సమీ పంలో ఏపీ జెన్‌కో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ తిప్పాన హరిరెడ్డి, రాష్ట్ర స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ సైంటిస్ట్‌ సీహెచ్‌ తాతబాబు ఆధ్వర్యంలో ట్రోపో గ్రాఫికల్‌ సర్వేనిర్వహించడానికి వచ్చారు.

 పవర్‌ ప్లాంట్‌ సర్వేను అడ్డుకున్న గిరిజనులు
సర్వే పరికరాలను అధికారుల నుంచి తీసుకుంటున్న గిరిజనులు:

సరుబుజ్జిలి, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి):సరుబుజ్జిలి, బూర్జ మం డలాల సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ డీపీఆర్‌ సర్వేను గిరిజనులు అడ్డుకున్నారు. గురు వారంసాయంత్రం సరుబుజ్జిలి మండలంలోని వెన్నెలవలస సమీ పంలో ఏపీ జెన్‌కో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ తిప్పాన హరిరెడ్డి, రాష్ట్ర స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ సైంటిస్ట్‌ సీహెచ్‌ తాతబాబు ఆధ్వర్యంలో ట్రోపో గ్రాఫికల్‌ సర్వేనిర్వహించడానికి వచ్చారు.డీపీఆర్‌ నిమిత్తం అధి కారులు ఫీజబులిటీ సర్వే నిర్వహిస్తున్న సమాచారాన్ని తెలుసుకున్న సరుబుజ్జిలి, బూర్జ మండలాలకు చెందిన కొంతమంది గిరిజనులు అక్కడకు చేరుకొని సర్వేచేస్తున్న అధికారులను అడ్డుకున్నారు. సర్వేకు ఉపయోగించే డ్రోన్‌ కెమెరాలు, ఎక్విప్‌మెంట్‌ను గిరిజనులు తీసుకోవ డంతో సంబంధిత అధికారులు ఆమదాలవలస సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.సత్యనారాయణకు సమాచారం ఇచ్చారు. సీఐతో పాటు బూర్జ ఎస్‌ఐ ఎం.ప్రవల్లిక పోలీస్‌సిబ్బందితో అక్కడి చేరుకొని గిరిజనులతో మాట్లా డి వారు తీసుకున్న డ్రోన్‌ కెమెరా ఎక్విప్‌మెంట్‌ను తిరిగి సర్వే అధికా రులకు అప్పగించారు.అనంతరం అధికారులు పోలీసులు గిరిజనులతో మాట్లాడుతూ త్వరలో సరుబుజ్జిలి, బూర్జ తహసీల్దార్లు, పోలీస్‌ అధి కారులతో గిరిజన గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించను న్నట్లు తెలిపారు. దీంతో గిరిజనులు శాంతించడం సర్వే అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు.

Updated Date - Sep 11 , 2025 | 11:58 PM