గిరిజన మహిళకు ప్రసవ కష్టాలు
ABN , Publish Date - Jul 31 , 2025 | 11:55 PM
కొఠారింగితాళభద్రకుచెందిన ఓ గిరిజన గర్భిణికి నెలలు నిండడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమఽధ్యలో వాహనం నిలిచిపోవడంతో తల్లడిల్లిపోయింది.
పలాసరూరల్, జూలై31(ఆంధ్రజ్యోతి): కొఠారింగితాళభద్రకుచెందిన ఓ గిరిజన గర్భిణికి నెలలు నిండడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమఽధ్యలో వాహనం నిలిచిపోవడంతో తల్లడిల్లిపోయింది. ప్రసవానికి సమయం దగ్గర పడుతుండడంతో అక్కడ నొప్పులు ఎక్కువకావడం వల్ల అవస్థలకు గురైంది.బంధువులు, గ్రామస్థుల కథనం మేరకు... మండలంలోని కొఠారింగితాళభద్రకు చెందిన గర్భిణి సవర శ్యామలకు నెలలు నిండడంతో గురువారం పురిటి నొప్పులతో బాధపడడంతో కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ గ్రామానికి వెళ్లే రహదారి బురదమయం కావడంతో కష్టం మీద 108 వాహనం గ్రామానికి చేరుకుంది. శ్యామలను ఎక్కించి పలాస ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో వాహనం బురదరోడ్డులో కూరుకుపోయింది. ఆ సమయంలో శ్యామలకు నొప్పులు అధికం కావడంతో రోడ్డుపైనే అష్టకష్టాలు పడింది. వాహనాన్ని బయటకు తీసుకొచ్చి ఆమెను అతికష్టం మీద పలాసలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో అందరూ ఊపిరి పిల్చుకున్నారు.