Share News

సరుకుల పంపిణీలో పారదర్శకత పాటించాలి

ABN , Publish Date - Oct 06 , 2025 | 11:52 PM

బీపీఎల్‌ కార్డుదారులకు అందజేస్తున్న సరుకుల పంపిణీలో పారదర్శకత పాటించాలని ఆహార కమిషన్‌ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి కోరారు. కొలతల్లో తగ్గింపు, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ను తనిఖీచేశారు. అనంతరం పురుషోత్తపురంలో డీలరుషాపును పరిశీలించారు.

సరుకుల పంపిణీలో పారదర్శకత పాటించాలి
పలాస రూరల్‌:ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో రికార్డును తనిఖీ చేస్తున్న ప్రతాప్‌రెడ్డి

పలాసరూరల్‌, అక్టోబరు6(ఆంధ్రజ్యోతి): బీపీఎల్‌ కార్డుదారులకు అందజేస్తున్న సరుకుల పంపిణీలో పారదర్శకత పాటించాలని ఆహార కమిషన్‌ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి కోరారు. కొలతల్లో తగ్గింపు, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ను తనిఖీచేశారు. అనంతరం పురుషోత్తపురంలో డీలరుషాపును పరిశీలించారు.

ఫహరిపురం, అక్టోబరు6 (ఆంధ్రజ్యోతి):భోజనాల్లో నాణ్యత పాటించా లనిరాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం మందసమండలంలోని జీఆర్‌పురంలో కేజీబీవీ పాఠశాలలో విద్యార్థినులతో మాట్లాడి భోజనాలపై అడిగి తెలుసుకున్నారు.

ఫకోటబొమ్మాళి, అక్టోబరు6 (ఆంధ్రజ్యోతి):స్థానిక ఎస్సీ సంక్షేమ బాలుర వసతి గృహాన్ని రాష్ట్ర ఆహార కమిషన్‌ చైర్మన్‌ పరిశీలించారు.

ఫటెక్కలి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): టెక్కలి బాలికల సమీకృత సంక్షేమ వసతిగృహాన్ని ఆహార కమిషన్‌ చైర్మన్‌ విజయప్రతాప్‌రెడ్డి తనిఖీ చేశారు.

ఫ సోంపేట/కంచిలి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): సోంపేట, కంచిలి మం డలాల్లోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, వసతి గృహాలు, అంబేడ్కర్‌ గురుకులాలు,ఎంఎల్‌ఎస్‌ పాయింట్లను రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ సీహెచ్‌ ప్రతాప్‌రెడ్డి తనిఖీచేశారు.వాడపాలెం కొత్తూరువసతిగృహంలో తనిఖీ సమ యంలోలోటుపాట్లు గుర్తించినట్లు తెలిపారు.హాస్టల్‌లో వారానికిఐదుగుడ్లు పెట్టాల్సి ఉన్నా రెండుఇస్తున్నట్లు తనదృష్టికి వచ్చిందని,దీంతో సదరు వా ర్డెన్‌కు షోకాజ్‌నోటీస్‌ఇవ్వాలని హాస్టళ్ల ఉన్నతాధికారిని ఆదేశించామ న్నారు.

Updated Date - Oct 06 , 2025 | 11:52 PM