theft ట్రాన్స్‌ఫార్మర్ కాయిల్స్, ఆయిల్ చోరీ
ABN , Publish Date - Mar 11 , 2025 | 11:55 PM
theft అక్కులపేట ఎత్తిపోతల పథకం పరిఽధిలోని బొడ్డేపల్లి రాజగోపాల రావు వంశధార ప్రాజెక్టు కుడి ప్రధా న 20ఆర్ పిల్ల కాలువ వద్ద ఉన్న ఎలక్ర్టికల్ మినీ సబ్ స్టేషన్‌లోని మూడు ట్రాన్స్‌ఫార్మర్‌లో కాయిల్స్, ఆయిల్ చోరీకి గురయ్యాయని శ్రీనివాసాచార్యుల పేట సర్పంచ్ బొడ్డేపల్లి గౌరీపతిరావు తెలిపారు.

ఆమదాలవలస, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): అక్కులపేట ఎత్తిపోతల పథకం పరిఽధిలోని బొడ్డేపల్లి రాజగోపాల రావు వంశధార ప్రాజెక్టు కుడి ప్రధా న 20ఆర్ పిల్ల కాలువ వద్ద ఉన్న ఎలక్ర్టికల్ మినీ సబ్ స్టేషన్‌లోని మూడు ట్రాన్స్‌ఫార్మర్‌లో కాయిల్స్, ఆయిల్ చోరీకి గురయ్యాయని శ్రీనివాసాచార్యుల పేట సర్పంచ్ బొడ్డేపల్లి గౌరీపతిరావు తెలిపారు. చోరీకి గురైన సొత్తు సుమారు రూ.15 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. ఈ చోరీపై వంశధార ఇంజనీరింగ్ అధికారులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువచ్చేందుకు కొంతమంది కుట్రచేసి దొంగతనం చేశారని గౌరీపతిరావు పేర్కొన్నారు.
ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్టు
పలాస,మార్చి11(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ తాళభద్ర గేటు నుంచి జయరామచంద్రపురం వెళ్లే దారిలో మంగళవారం సాయంత్రం కాశీబుగ్గ పట్టణానికి చెందిన ఐదుగురు పేకాట ఆడుతుండగా దాడిచేసినట్లు కాశీబుగ్గ పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.9430 నగదు స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
తల్లీకూతురు అదృశ్యంపై ఫిర్యాదు
పలాస, మార్చి11(ఆంధ్రజ్యోతి): మందస మండలం వాసుదేవుపురం గ్రామానికి చెందిన తన భార్య జ్యోతి, కుమార్తె హాన్విక అదృశ్యమైనట్లు పోలీసులకు జ్యోతి భర్త సాలిన సింహాచలం ఫిర్యాదు చేశారు. ఈనెల 10న తన భార్య, కుమార్తెలు కొర్రాయి గేటు వద్ద తనను ఉండమని చెప్పి ఎంత కూ రాకపోవడంతో తన అత్తవారి గ్రామమైన లొద్దభద్ర, ఇతర బంధువుల ఇంట్లో వాకబు చేయగా వారి ఆచూకీ లభించలేదు. ఆమె మొబైల్‌కు ఫోన్ చేస్తున్నా నాట్ రీచ్‌బుల్ అని వస్తుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.