Share News

Teachers trasnfors: 4,156 మంది ఉపాధ్యాయులకు బదిలీ

ABN , Publish Date - Jun 15 , 2025 | 11:23 PM

School education department Transfer orders ఉమ్మడి జిల్లాలో సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయుల(ఎస్జీటీ) బదిలీ కౌన్సిలింగ్‌ శనివారం అర్ధరాత్రితో ముగిసింది. గ్రేడ్‌ -2 హెచ్‌ఎం, పీఎస్‌హెచ్‌ఎంలు, పీడీలు, స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్జీటీలు మొత్తం 6,392 మంది బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 4,156 మంది స్థానచలనమయ్యారు.

Teachers trasnfors: 4,156 మంది ఉపాధ్యాయులకు బదిలీ

  • సజావుగా ముగిసిన ప్రక్రియ

  • నేటి నుంచి కొత్త పాఠశాలల్లో విధుల్లో చేరాలని ఆదేశం

  • నరసన్నపేట, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయుల(ఎస్జీటీ) బదిలీ కౌన్సిలింగ్‌ శనివారం అర్ధరాత్రితో ముగిసింది. గ్రేడ్‌ -2 హెచ్‌ఎం, పీఎస్‌హెచ్‌ఎంలు, పీడీలు, స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్జీటీలు మొత్తం 6,392 మంది బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 4,156 మంది స్థానచలనమయ్యారు. ఇందులో ఎస్జీటీలు 1,962 మంది ఉండగా.. బదిలీ కౌన్సిలింగ్‌ ప్రక్రియ మాన్యువల్‌గా నిర్వహించారు. మిగిలిన 2,194 మంది స్కూల్‌ అసిస్టెంట్లు, గ్రేడ్‌-2 హెచ్‌ఎంలు, పీఎస్‌ హెచ్‌ఎంలు. ఉమ్మడి జిల్లాలో 2,860 మంది ఎస్జీటీలు బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,822 మంది తప్పనిసరిగా బదిలీపై వెళ్లారు. 1048 మంది రిక్వెస్ట్‌ బదిలీకి దరఖాస్తు చేసుకోగా సుమారు 140మందికి అవకాశం దక్కింది. అలాగే 124 మంది ఉపాధ్యాయులకు పదోన్నతి లభించింది.

  • స్పౌజ్‌లో కొందరికి చిక్కులు

  • పోలాకి మండలంలో పనిచేస్తున్న తామరాపల్లికి చెందిన ఒక ఉపాధ్యాయుని స్పౌజ్‌ వినియోగించుకున్నారు. భర్త మందస మండలంలో పనిచేయడంతో భార్య కూడా అదే మండలానికి వెళ్లాల్సి వచ్చింది. ఇలా ఎందరో స్పౌజ్‌ వినియోగించుకున్న ఉపాధ్యాయులు బదిలీల్లో ఇబ్బందులు పడ్డారు. స్పౌజ్‌ పాయింట్లు లేని కొందరు టీచర్లకు మేలైన స్థానాలు లభించడంతో వారు ఆనందంగా ఉన్నారు. మొత్తంగా టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ మొదట్లో గందరగోళంగా ఉన్నా తర్వాత సాఫీగా ముగిసింది. మునసబుపేటలోని గురజాడ ఎడ్యుకేషన్‌ సొసైటీ ప్రాంగణంలోని కౌన్సిలింగ్‌ నిర్వహణలో డీఈవో, ఇతర అధికారుల బృందానికి ఉపాధ్యాయ సంఘాలు సహకరించడంతో ప్రక్రియ సజావుగా సాగింది. ఇదిలా ఉండగా.. ఎస్జీటీ ఉపాధ్యాయుల బదిలీ ఆర్డర్లు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. బదిలీ అయిన ఎస్జీటీలంతా సోమవారం కొత్త పాఠశాలల్లో విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు బదిలీ అయిన ఉపాధ్యాయులంతా ఎంఈవో కార్యాలయాల్లో జాయినింగ్‌ ఆర్డర్లు తీసుకుని.. పాఠశాలలో విధులకు హాజరుకానున్నారు.

Updated Date - Jun 15 , 2025 | 11:23 PM