Share News

ఎల్‌ఎన్‌ పేటను శ్రీకాకుళం డివిజన్‌లోకి మార్చండి

ABN , Publish Date - Aug 08 , 2025 | 11:48 PM

ఎల్‌ఎన్‌ పేట మండలాన్ని టెక్కలి రెవెన్యూ డివిజన్‌ నుంచి శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్‌లోకి మార్చాలని టీడీపీ నాయకులు కోరుతున్నారు.

ఎల్‌ఎన్‌ పేటను శ్రీకాకుళం డివిజన్‌లోకి మార్చండి
సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

ఎల్‌ఎన్‌ పేట, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): ఎల్‌ఎన్‌ పేట మండలాన్ని టెక్కలి రెవెన్యూ డివిజన్‌ నుంచి శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్‌లోకి మార్చాలని టీడీపీ నాయకులు కోరుతున్నారు. డొంకలబడవంజ గ్రామంలో ఆ పార్టీ మండల అధ్య క్ష, కారదర్శులు ఎం.మనోహర్‌నాయుడు, కె.చిరంజీవి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎల్‌ఎన్‌ పేట మండలం గతంలో శ్రీకాకుళం డివిజన్‌లో ఉన్నప్పుడు మండల ప్రజలకు ఎలాంటి అసౌక ర్యం ఉండేది కాదని, గత ప్రభుత్వ అనాలోచిత కారణంగా టెక్కలి డివిజన్‌లోకి వెల్లిపోయిందని, దీంతో మండల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. టెక్కలి వెళ్లేందుకు ఎలాంటి బస్సులు, వాహన సౌకర్యం లేకపోవడంతో నానా యాతన పడాల్సి వస్తుందన్నారు. అదే శ్రీకాకుళం వెళ్లేందుకు ఎంతో అనువగా ఉంటుందన్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే మామిడి. గోవిందరావు చొరవ తీసుకొని మండల ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. సమావే శంలో టీడీపీ నాయకులు వి.ఆనందరావు, ఎస్‌.కిషోర్‌కుమారు, ఎస్‌.తేజేశ్వర రావు, టి.అప్పన్న, కె.కృష్ణమాచారి, జె.మోహనరావు, పి.వెంకటరావు, పి.తవిటయ్య తదితరులు ఉన్నారు.

Updated Date - Aug 08 , 2025 | 11:48 PM