Share News

బదిలీల కౌన్సెలింగ్‌ మాన్యువల్‌గా చే పట్టాలి

ABN , Publish Date - Jun 09 , 2025 | 12:01 AM

సెకండరీ గ్రేడ్‌ టీచర్లు, భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్‌ను మాన్యువల్‌గా చేపట్టాలని ఉపాధ్యాయసంఘాలు డిమాండ్‌ చేశాయి.

బదిలీల కౌన్సెలింగ్‌ మాన్యువల్‌గా చే పట్టాలి
డీఈవో కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు:

అరసవల్లి, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): సెకండరీ గ్రేడ్‌ టీచర్లు, భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్‌ను మాన్యువల్‌గా చేపట్టాలని ఉపాధ్యాయసంఘాలు డిమాండ్‌ చేశాయి.ఈ మేరకు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు వేలాది మంది ఉపాధ్యాయులు డీఈవో కార్యాలయా న్ని ఆదివారం ముట్టడించారు. బదిలీలకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి మాన్యువల్‌ కౌన్సెలింగ్‌కు మాట ఇచ్చి,వెబ్‌కౌన్సెలింగ్‌ చేపట్టడంతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.భానుమూర్తి మా ట్లాడుతూ బదిలీల ప్రక్రియలో ఉపాధ్యాయ సంఘాలకు ఇచ్చిన మాట తప్పడం సరికాదన్నారు. యుటీఎఫ్‌ నాయకులు రెడ్డి మోహనరావు, ఎస్‌.కిషోర్‌కుమార్‌ మా ట్లాడుతూ సంఖ్యాపరంగా అత్యధికంగాఉన్న ఎస్జీటీలకు వెబ్‌ కౌన్సెలింగ్‌తో ఇబ్బం దులు తప్పడంలేదన్నారు. బదిలీలకు సంబంధించి ఉపాధ్యాయులను మానసిక ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాద న్నారు.ఉపాధ్యాయులకు ముందుగా హామీఇచ్చి తరువాత మండల కేంద్రాలకు వచ్చి వెబ్‌ ఆప్షన్లు పెట్టుకోమనడం దారుణమన్నారు.ధర్నాచేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. మాన్యు వల్‌గా బదిలీలు చేపట్టేందుకు సమయం సరిపోదని అధికారులు చెబుతున్నారని, ఒకటి రెండురోజులు ఆలస్యమైనా మాన్యువల్‌విధానంలోనే బదిలీలు నిర్వహించా లని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో బాబూరావు, రమణ, వేంకటేశ్వర్లు, సోమేశ్వ రరావు, రమేష్‌, గోపాలరావు, భాస్కరరావు, ధనుంజయరావు, వసంతరావు, చౌదరి రవీంద్ర వివిధ మండలాల ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Jun 09 , 2025 | 12:01 AM