నీటి ఉధృతితో నిలిచిన రాకపోకలు
ABN , Publish Date - Oct 28 , 2025 | 11:54 PM
జిల్లాలో వరద ఉధృతికి పలు గ్రామాల రహదారులపై నీటి ప్రవాహంతో పలు ప్రాంతాల నుంచి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
కంచిలి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ ప్రభావంతో రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు సాగునీటి కా లువ నుంచి వరదనీరు సమీప గ్రామాల రహ దారులపై ప్రవహిస్తుండడంతో బెల్లుపడా, పోలేరు, డీజీపురం, బైరిపురం, ఘాటీ తదితర పంచాయతీల్లోని పలు గ్రామాలకు సరిహద్దు ఒడిశా నుంచి రాకపోలకు నిలిచి పోయాయి. నారాయణబట్టి గ్రామం వద్ద ఉన్న గోవిందసాగరం నుంచి వరదనీరు రహదారిపైకి చేరింది. దీంతో పాదచారులతోపాటు వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మండల ప్రత్యేకాధికారి అప్పలస్వామి, స్థానిక తహసీల్దార్ ఎన్.రమేష్‌కుమార్, ఎంపీడీవో వి.తిరుమలరావు, ఎంఈవో శివరాంప్రసాద్, చిట్టిబాబబు, డీటీ సంతోష్, రెవెన్యూ, సచివాలయ సిబ్బందితో కలసి గంగాసాగరం రిజర్వాయర్, ముకుందసాగరాలను పరిశీలించారు. మండల శివారులోని గిరిజన గ్రామాల వద్ద ఎటువంటి నివాసం లేని సంచారజీవితం గడుపుతున్న పది బుడజంగమ కుటుంబాలను గుర్తించి, వారిని కుంబరినౌగాం పాఠశాలలో వసతి కల్పించారు. నువాగడకు చెందిన గోమాంగో సీతారాంకు నువ్వాగడ ఆశ్రమపాఠశాలలో వసతి కల్పించారు. రాకాసిగెడ్డ వద్ద నీరు ఉదృతంగా ప్రవహించడంతో కర్తలి,సిర్తలి, ఎంఎస్‌పల్లి తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచాయి.
బాతుపురం రోడ్డు మూసివేత
సోంపేట రూరల్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): తుఫా న్ ప్రభావంతో పైడిగాం ప్రాజెక్టు పరిధిలో ఉన్న అనేక గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. కొర్లాం నుంచి బాతుపురం వెళ్లే రహదారి పొడువునా రోడ్డుకు ఇరువైపులా ఉన్న కొత్త బాతుపురం, పైడిగాం, బకుడు, జాన్నాసాయి, హంసమేరా, బలిగాం గ్రామాల ప్రజలకు మండల అధికారులు అప్రమత్తం చేశారు. బాతుపురం గ్రామానికి కొద్ది మీటర్ల దూరంలో కాలువ నీరు రోడ్డుపైకి ప్రవ హించడంతో ఆ గ్రామానికి అధికా రులు రాకపోకలు నిలిపివేశారు. ఇక్కడికి సమీపంలో చీక టిగెడ్డ కల్వర్టు వరదనీటిలో కొట్టుకు పోయింది. పునరా వాస కేంద్రాల్లో 160 మందికి వసతి, భోజన సదుపా యాలు కల్పించారు.
రైల్వే అండర్ టన్నెల్‌లోకి నీరు..
ఆమదాలవలస, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): మొంథా తుపాన్ ప్రభావంతో స్థానిక రైల్వేశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. రైల్వే ట్రాక్‌ను ఆనుకొని ఉన్న కనుగువలస అండర్ టన్నెల్‌లో నీరు చేరడంతో మంగళవారం మూసి వేశారు. దీనితో ఆమదాలవలస పట్టణం నుంచి తమ్మ య్యపేట, ముద్దాడపేట, కలివరంతో పాటు తొగరాం గ్రా మాలకు రాకపోకలకు స్థానికులు ఇబ్బందులుపడ్డారు. తుఫాన్ నేపథ్యంలో చిగురు వలస గ్రామ పంచాయతీ శ్రీరాంవలస ప్రాంతంలో ఉన్న వాల్మీకి నగర ఎరుకుల కులస్థులకు తహసీల్దార్ ఎల్.మధుసూదనరావు సరుబు జ్జిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు.
పద్మాపురం గెడ్డకు భారీ వరద
ఇచ్ఛాపురం, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలు కారణంగా మండలంలోని ఇన్నేసుపేట గ్రామ సమీపంలో పద్మపురం గెడ్డలో భారీ వరద నీరు చేరడంతో గ్రామం జలదిగ్బంధం అయింది. సమీపంలోని పంట పొలాలు నీట మునగడంతో అన్నదాతలు ఆందోళన చెందుతు న్నారు. సమీప గ్రామాలైన తులసిగాం, దర్మపురం, కొఠారి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తులసిగాం, ఇన్నేసుపేట పరిదిలో సుమారుగా 247 ఎకరాలు ముంపు నకు గురయ్యాయి. ఇదిలా ఉండగా మండలంలోఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను తహసీల్దార్ వెంకటరావు, ఎంపీ డీవో ప్రభాకరరావు, సీఐ చిన్నమనాయుడు, ఎస్‌ఐ ముకుందరావు సందర్శించి వంటలను పరిశీలించారు.
కోతకు గురైన సముద్రతీరం
కవిటి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): తుపాఏక్ష ప్రభా వంతో మండలంలో సోమవారం రాత్రి నుంచి మంగళ వారం వరకు భారీ వర్షం కురిసింది. కొబ్బరి తోటల్లో నీరు చేరింది. తీరప్రాంతాలు అలల ధాటికి కోతకుగురయ్యాయి. అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.