నగరంలో ట్రాఫిక్ డైవర్షన్
ABN , Publish Date - Nov 15 , 2025 | 12:00 AM
నగరంలోని కృష్ణాపార్క్ వద్ద కల్వర్టు పనులు చేపడుతున్నందున వాహనాల రాకపోకలకు అంతరాయం కల గకుండా ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు శ్రీకాకుళం ట్రాఫిక్ సీఐ వానపల్లి రామరావు తె లిపారు.
శ్రీకాకుళం క్రైం, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): నగరంలోని కృష్ణాపార్క్ వద్ద కల్వర్టు పనులు చేపడుతున్నందున వాహనాల రాకపోకలకు అంతరాయం కల గకుండా ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు శ్రీకాకుళం ట్రాఫిక్ సీఐ వానపల్లి రామరావు తె లిపారు. శుక్రవారం నుంచి 30వ తేదీ వరకు కల్వర్టు పనులు చేపట్టనున్నారన్నా రు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఏడు రోడ్ల జంక్షన్ వైపు వెళ్లే భారీ వాహనాలు డే అండ్ నైట్ జంక్షన్ మీదుగా ఇలిసిపురం జంక్షన్, రామలక్ష్మణ, సూర్యమహల్, అరసవల్లి మిల్లు జంక్షన్ మీదుగా వెళ్లాల్సి ఉంటుందన్నారు. అలాగే పాత బస్టాండ్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు వెళ్లే భారీ వాహనాలు ఏడు రోడ్ల జంక్షన్ నుంచి పాతబ్రిడ్జి మీదుగా పీఎన్‌కాలనీ వైపు నుంచి డేఅండ్‌నైట్ జంక్షన్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ చేరుకోవాలని ఆయన సూచించారు.