Share News

సంప్రదాయ కళలను ప్రోత్సహించాలి: రవికుమార్‌

ABN , Publish Date - Oct 15 , 2025 | 11:47 PM

సంప్రదాయ కళ లైన సంగీతం, నృత్యం, జానపదాల వంటి వాటిని ప్రోత్సహించాలని ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు.

సంప్రదాయ కళలను ప్రోత్సహించాలి: రవికుమార్‌
నృత్య కళాకారిణులు శ్రీలత, చిన్నారులను అభినందిస్తున్న ఎమ్మెల్యే రవికుమార్‌

ఆమదాలవలస, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): సంప్రదాయ కళ లైన సంగీతం, నృత్యం, జానపదా ల వంటి వాటిని ప్రోత్సహించాలని ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నా రు. కూచిపూడి నత్యరూపకర్త, పద్మభూషణ్‌ డాక్టర్‌ వెంపటి చినసత్యం 96వ జయంతిని బుధవారం స్థానిక ఎస్‌ఎస్‌ఎన్‌ కల్యాణ మండపంలో నిర్వ హించారు. వెంపటాపు సత్యం, భారతరత్న అబ్దుల్‌ కలాం చిత్రప టాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం నాట్యశ్రీ నృత్య కళా నికేతన్‌ చిన్నారుల నృత్యాభినయం ఆకట్టుకుంది. సంస్థ నిర్వాహకురాలు కూన శ్రీలతతో పాటు చిన్నారులను అభినందించారు. మందపల్లి రామ కృష్ణారావు అబ్దుల్‌ కలాం జీవితంపై రచించిన మహామనీషి పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త పేడాడ రామ్మోహన్‌రావు, సామాజికవేత్త బాడాన దేవభూషణరావు, రోటరీ క్లబ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీటీ చౌదరి, జె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Oct 15 , 2025 | 11:47 PM