ధాన్యంతో ట్రాక్టర్లు బారులు
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:22 AM
జిల్లాలో ధాన్యం కొనుగోలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
జిల్లాలో ధాన్యం కొనుగోలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ధాన్యం లోడ్లతో ట్రాక్టర్లు మిల్లుల వద్ద బారులు తీరుతున్నాయి. సోమవారం నందిగాం మండలం పెద్దతామరాపల్లిలోని సాయి శ్రీనివాస రైస్ మిల్లు, పెంటూరులోని వినాయక రైస్ మిల్లు మాత్రమే బ్యాంకు గ్యారెంటీలు అందించాయి. దీంతో మండలంలోని 22 రైతుసేవా కేంద్రాల పరిధిలోని రైతులకు ఈ రెండు మిల్లులకే ట్రక్ షీట్లను కేటాయించారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ రెండు మిల్లుల వద్ద ధాన్యం లోడ్లతో ట్రాక్టర్లు బారులు తీరాయి. ముఖ్యంగా పెద్దతామరాపల్లి సర్వీసు రహదారిలో ట్రాక్టర్లు బారులుతీరడంతో ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
-నందిగాం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి):