Share News

కల్తీ ఆహారం తిని పర్యాటకుల అస్వస్థత

ABN , Publish Date - May 17 , 2025 | 11:46 PM

కర్ణాటక బోర్డర్‌ ప్రాంతం నుంచి అయోధ్య వెళ్లి తిరిగి వస్తుండగా శుక్రవారంరాత్రి ఒడిశాబోర్డర్‌లో కల్తీ ఆహారం తిని బస్సులో ఉన్న 16మంది పర్యాటకులు అస్వస్థతకు గురయ్యారు.

 కల్తీ ఆహారం తిని పర్యాటకుల అస్వస్థత
టెక్కలి జిల్లా కేంద్రాసుపత్రిలో చికిత్సపొందుతున్న టూరిస్టులు:

టెక్కలి,మే 17(ఆంధ్రజ్యోతి): కర్ణాటక బోర్డర్‌ ప్రాంతం నుంచి అయోధ్య వెళ్లి తిరిగి వస్తుండగా శుక్రవారంరాత్రి ఒడిశాబోర్డర్‌లో కల్తీ ఆహారం తిని బస్సులో ఉన్న 16మంది పర్యాటకులు అస్వస్థతకు గురయ్యారు. అయితే శుక్రవారం రాత్రికే కొందరు బరంపురం ఆసుపత్రిలో చికిత్సపొంది టూరిస్ట్‌ బస్సును విడి చిపెట్టి రైలులో ఇళ్లకు చేరారు. మరికొందరు పర్యాటకులు బస్సులో వస్తుండగా శనివారం తెల్లవారి ఆరుగంటలకు టెక్కలి వచ్చేసరికి వాంతులు, విరోచనాల తో వారంతా జిల్లాకేంద్రాసుపత్రిలో చేరారు. ఫుడ్‌ పాయిజన్‌ జరిగిందని గ్రహిం చిన వైద్య బృందం వారికి అవసరమైన సేవలందించడంతో కోలుకున్నారు.

Updated Date - May 17 , 2025 | 11:47 PM