Share News

Tourism park రూ.10 కోట్లతో టూరిజం పార్కు అభివృద్ధి

ABN , Publish Date - Apr 30 , 2025 | 11:59 PM

Tourism park టెక్కలి సమీపంలోని 224 ఎకరాల విస్తీర్ణం ఉన్న మదన గోపాలసాగరాన్ని టూరిజం పార్కుగా అభివృద్ధి చేసేం దుకు ఆయా శాఖల అధి కారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు బుధవారం ఉమ్మడిగా సర్వే నిర్వహిం చారు.

Tourism park రూ.10 కోట్లతో టూరిజం పార్కు అభివృద్ధి
సర్వే చేస్తున్న అధికారులు

మదనగోపాల సాగరాన్ని సర్వే చేసిన అధికారులు

టెక్కలి, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): టెక్కలి సమీపంలోని 224 ఎకరాల విస్తీర్ణం ఉన్న మదన గోపాలసాగరాన్ని టూరిజం పార్కుగా అభివృద్ధి చేసేం దుకు ఆయా శాఖల అధి కారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు బుధవారం ఉమ్మడిగా సర్వే నిర్వహిం చారు. ఇటీవల రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మదన గోపాల సాగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలపై అధికారులతో చర్చించి దిశ నిర్దేశం చేశా రు. ఈ నేపథ్యంలో వంశధార ఈఈ బి.శేఖరరావు, ప్రైవేట్‌ టూరిజం ఏజెన్సీ ప్రతినిధి బృందం జాతీయ రహదారి పక్కన ఉన్న మదన గోపాల సాగ రాన్ని పరిశీలించారు. రిసార్ట్స్‌, లోపల 50 ఎకరాల్లో బోటు షికార్‌, జలాశ యం గట్టు బ్యూటిఫికేషన్‌ యుద్ధ ప్రాతిపదికన చేయించేందుకు తీసుకో వాల్సిన చర్యలను పరిశీలించామని, ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని ఈఈ శేఖరరావు తెలిపారు.

Updated Date - Apr 30 , 2025 | 11:59 PM