లబ్ధిదారులకు త్వరలో టిడ్కో ఇళ్లు: ఎమ్మెల్యే
ABN , Publish Date - Jul 15 , 2025 | 11:34 PM
టిడ్కో ఇళ్లు త్వరలో లబ్ధిదారులకు అందజేయను న్నట్లు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. మంగళవారం టిడ్కో చైర్మన్ వి.అజ య్‌కుమార్‌తో కలిసి గృహసముదాయాన్ని పరిశీలించారు.
పలాస, జూలై 15(ఆంధ్రజ్యోతి): టిడ్కో ఇళ్లు త్వరలో లబ్ధిదారులకు అందజేయను న్నట్లు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. మంగళవారం టిడ్కో చైర్మన్ వి.అజ య్‌కుమార్‌తో కలిసి గృహసముదాయాన్ని పరిశీలించారు.ఈసందర్భంగా ఆమె మాట్లా డుతూ వైసీపీహయాంలో రంగులకేప్రాధాన్యంఇచ్చి నిర్మాణంమరిచిపోయారని విమర్శిం చారు.డీడీలు తీసినవారికి గృహాలు అందిస్తామని, లబ్ధిదారులు ఆందోళన చెందవద్దని కోరారు.అలాగే మునిసిపల్‌కార్యాలయం ఆవరణలో తయారుచేసిన పుష్‌కార్ట్‌లను శిరీష ప్రారంభించారు. కాగా కమిషనర్ ఎన్.రామారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మెప్మా ఆర్పీలకు ట్యాబ్‌లు, మునిసిపల్ సిబ్బందికి కంప్యూటర్లు అందజేశారు.
రూ.550 కోట్ల అభివృద్ధి పనులు
ఏడాది కాలంలో నియోజకవర్గంలో రూ.550 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే శిరీష తెలిపారు. పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలోని 22వ వార్డు పొంద రవీధి, పెద్దవీధిలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్ర మంలో ఏపీటీసీ చైర్మన్ వజ్జ బాబూరావు, బీసీసెల్ రాష్ట్ర కార్యదర్శి లొడగల కామేశ్వ రరావుయాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పీరుకట్ల విఠల్‌రావు, గాలి కృష్ణారావు, గురిటి సూర్యనారాయణ, దువ్వాడ శ్రీకాంత్, బడ ్డ నాగరాజు, సప్ప నవీన్, జోగ మల్లి, మల్లా శ్రీనివాస్, టంకాల రవిశంకర్‌గుప్తా, యవ్వారి మోహనరావు, దడియాల నర్సింహులు, కొరికాన శంకర్ పాల్గొన్నారు.