డిసెంబరు 31 నాటికి టిడ్కో గృహాల పంపిణీ
ABN , Publish Date - Jul 15 , 2025 | 11:24 PM
ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి అర్హు లైన ప్రతి ఒక్కరికీ టిడ్కో గృహాలను అందజేస్తామని ఏపీ టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్, ఎమ్మెల్యే, విప్ బి.అశోక్ అన్నారు.
ఇచ్ఛాపురం, జూలై 15 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి అర్హు లైన ప్రతి ఒక్కరికీ టిడ్కో గృహాలను అందజేస్తామని ఏపీ టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్, ఎమ్మెల్యే, విప్ బి.అశోక్ అన్నారు. రాష్ట్రంలో 70 వేల మంది లబ్ధిదారు లకు టిడ్కో గృహ సముదా యాలు అప్పగిస్తామని తెలి పారు. మంగళవారం మున్సి పాల్టీ పరిధి ఏఎస్‌పేట (బోర్డర్)లోని టిడ్కో గృహా లను పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాల యంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ మాట్లాడు తూ గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగానే టిడ్కో గృహాలు పూర్తి కాలేదని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ టిడ్కో గృహాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంద న్నారు. టిడ్కో చైర్మన్ అజయ్‌కుమార్ మాట్లాడు తూ గృహాల కోసం డీడీల రూపంలో డబ్బు చెల్లించిన ప్రతి లబ్ధిదారుడికీ గృహాలు అందిస్తామని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి రూ. 16,280 కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. కార్య క్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి రాజు, జనసేన జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్, టీడీపీ పట్టణ కార్యదర్శి నందిగాం కోటి, మున్సిపల్ కమిషనర్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.