రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
ABN , Publish Date - Jun 07 , 2025 | 11:24 PM
జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మహిళలు మృతిచెందారు. మరో లారీ క్లీనర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మహిళలు మృతిచెందారు. మరో లారీ క్లీనర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ట్రాక్టర్ కింద పడి వృద్ధురాలు
పోలాకి, జూన్ 7(ఆంధ్రజ్యోతి): పోలాకి మండలం రాజపురం గుల్లవానిపేట మార్గంలో ట్రా క్టర్‌ను తప్పించ బోయి బైక్ అదుపు తప్పి వృద్ధురాలు మృతి చెందిన ఘట న శనివారం రాత్రి సంభవించింది. బెల మర గ్రామానికి చెందిన బంధువు గొర్లె తిరుపతిరావు బైక్‌పై నవగాన ఆదిలక్ష్మి(60) వెనుక కూర్చొని వెళుతుండగా.. మట్టి ట్రాక్టర్‌ను తప్పించ బోయి బైక్ అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగింది. దీంతో ట్రాక్టర్ టైర్ కింద పడి ఆదిలక్ష్మి మృతిచెందింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..నవగాన ఆదిలక్ష్మి కోల్‌కతాలో నివాసముంటోంది. స్వగ్రామం బెలమరలో ఉంటున్న కుమార్తె వద్దకు ఇటీవల వచ్చి, తమ బంధువు తిరుపతిరావుతో బైక్‌పై వెళుతుండగా ఆమె మృతి చెందింది. మృతురాలికి ఇరువురు కుమార్తెలు, ఒక కుమారుడున్నారు. భర్త వైకుంఠరావు రెండేళ్ల కిందట మృతి చెందాడు. కుమార్తెను చూసేందుకు వచ్చి మృత్యువాత పడడంపై ఆమె బంధువులు, గ్రామస్థులు కన్నీరుమున్నీర వుతున్నారు. రోడ్డు ప్రమాదం కారంణంగా గుల్లవానిపేట, రాజపురం, బెలమర గ్రామాల మధ్య కొద్దిసేపు రాకపోకలు నిలిచి పోయాయి. మృతదేహానికి పంచనామా జరిపించి పోస్టుమార్టం నిమిత్తం నరసన్నపేట ఆసుపత్రికి తరలిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. తిరుపతిరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నామని ఎస్‌ఐ రంజిత్‌కుమార్ తెలిపారు.
దన్నానపేట వద్ద మహిళ..
రణస్థలం, జూన్ 7(ఆంధ్రజ్యోతి): దన్నానపేట జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కమ్మసిగడాం గ్రామానికి చెందిన కొరాడ సాయి(30) మృతి చెందింది. జేఆర్ పురం పురం పోలీసులు తెలి పిన వివరాల మేరకు.. ద్విచక్రవాహనంపై ముగ్గురు వస్తూ రోడ్డు క్రాస్ చేస్తుండగా.. వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరి గింది. ఈ ఘటనలో కోరాడ సాయి అక్కడికక్కడే మృతిచెందింది. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రకి తరలిం చారు. భర్త కోరాడ రామ్మూర్తి ఫిర్యాదు మేరకు జేఆర్ పురం ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.
చికిత్స పొందుతూ లారీ క్లీనర్..
ఎచ్చెర్ల, జూన్ 7(ఆంధ్రజ్యోతి): చిలకపాలెం ఫైఓవర్‌పై శనివారం వేకువ జామున 4.30 గంటల సమయంలో జరిగిన ప్రమాదంలో లారీ క్లీనర్ మృతి చెందగా, డ్రైవర్ గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌహతి (అసోం) నుంచి బెంగళూర్ వెళ్తున్న కొరియర్ లారీ చిలకపాలెం ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చేసరికి నిద్రమత్తు కారణంగా డ్రైవర్ అసింనాథ్ ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో గాయ పడిన అసోం రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్‌తో పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన క్లీనర్ సుబకాష్ మర్మర్(35)ను 108 అంబులెన్స్‌పై చికిత్స నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికి త్స పొందుతూ క్లీనర్ సుబకాష్ బర్మర్ మృతిచెందాడు. లారీ డ్రైవర్ ఇచ్చి న ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఎన్.కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.