Share News

గంజాయితో ముగ్గురు అరెస్టు

ABN , Publish Date - Jul 11 , 2025 | 12:35 AM

చెడు వ్యసనాలకు బానిసై గంజాయిని అమ్ముకోవడానికి యత్నించిన ముగ్గుర్ని అరెస్టు చేసినట్టు కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకట అప్పారావు తెలిపారు.

గంజాయితో ముగ్గురు అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ వెంకట అప్పారావు

పలాస, జూలై 10(ఆంధ్రజ్యోతి): చెడు వ్యసనాలకు బానిసై గంజాయిని అమ్ముకోవడానికి యత్నించిన ముగ్గుర్ని అరెస్టు చేసినట్టు కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకట అప్పారావు తెలిపారు. గురువారం కాశీబుగ్గ పోలీస్టేషన్‌లో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కాశీబుగ్గ పట్టణం పద్మనాభపురం కాలనీకి చెందిన మామిళ్ల మల్లేశ్వరరావు, తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాకు చెందిన దుర్గం రఘుకుమార్‌, గోదారి స్వామి విజయవాడలోని ఓ కేటరింగ్‌ షాపులో పనిచేసేవారు. వీరికి గంజాయి తాగే అలవాటు ఉంది. పూరిలో జరిగిన జగన్నాథ రథయాత్రలో వీరు ముగ్గురు పాల్గొని తిరిగి మల్లేశ్వరరావు ఇంటిలో మకాం పెట్టారు. గంజాయి తాగడంతోపాటు అమ్ముకొని డబ్బులు సంపాదించాల ని నిర్ణయించుకున్నారు. దీంతో బరంపురం (ఒడిశా)లో రెండు కిలోల గంజాయి కొనుగోలు చేసి కాశీబుగ్గ చేరుకున్నారు. అనంతరం వాటిని విజయవాడ తీసుకు వెళ్లేందుకు యత్నిస్తున్న క్రమంలో ఆ ముగ్గురు ద్విచక్ర వాహనంపై వెళ్తూ పోలీ సులకు పట్టుబడ్డారు. వీరిని అరెస్టు చేసి కోర్టుకు తరలించామని, వారి నుంచి గం జాయి, ద్విచక్రవాహనం, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

Updated Date - Jul 11 , 2025 | 12:35 AM