Gan̄jāyi గంజాయితో ముగ్గురి అరెస్టు
ABN , Publish Date - Apr 04 , 2025 | 11:45 PM
Gan̄jāyi ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ కె.వెంకటఅప్పారావు తెలిపారు.

కవిటి/ఇచ్ఛాపురం, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ కె.వెంకటఅప్పారావు తెలిపారు. వీరినుంచి రెండు కేజీల 140 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ వివరాలను డీఎస్పీ వెల్లడించారు. ఒడిశాకు చెందిన లక్ష్మీకాంత్ బలియార్ సింగ్‌తోపాటు మోహన్‌దాస్ ప్రదాన్‌ల ఆర్థిక పరిస్థితి బాగోలేక గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. తమ గ్రామాల సమీపంలో తక్కు వ ధరకు గంజాయిని కొనుగోలు చేసి వాటిని మహారాష్ట్ర తీసుకొని వెళ్లి అమ్మకం చేయాలని, వచ్చిన సొమ్మును ఇద్దరు పంచుకోవాలని నిర్ణయిం చారు. దీనికోసం మహారాష్ట్రలోని ఉస్మాన్‌బాద్‌కు చెందిన గంజాయి వ్యాపా రం చేసే షాహాజీ రామజాదవ్‌తో గతంలో ఏర్పడిన పరిచయం మేరకు ఆయన్ను సంప్రదించారు. ఈ మేరకు ఒడిశాలో గంజాయిని కొనుగోలు చేసి ఇచ్ఛాపురంలో రామజాదవ్‌కు అప్పగిస్తుండగా ఇచ్ఛాపురం పట్టణ పోలీసులు పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.
సారాతో ఇద్దరు..
సోంపేట, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): సారా తరలిస్తున్న సోంపేట మండ లం జీడిపుట్టుగకు చెందిన లోకనాథం, కవిటి మండలం ఎలమంచి పుట్టుగ కు చెందిన సూరయ్యను శుక్రవారం అరెస్టు చేసినట్లు సీఐ జీవీ రమణ తెలి పారు. లోకనాథం నుంచి 10 లీటర్లు, సూరయ్య నుంచి 8 లీటర్లు స్వాధీ నం చేసుకున్నట్లు చెప్పారు. వీరికి సారా సరఫరా చేసిన శారదాపురానికి చెంది న పిన్నింటి చంద్రయ్య, కాకర్లపుట్టుగకు చెందిన కాకర్ల సోమేశ్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాడుల్లో ఎస్‌ఐ సుజాత పాల్గొన్నారు.
రెండు కార్లు ఢీ
ఎచ్చెర్ల, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): ఫరీద్‌పేట పంచాయతీ కొయ్యరాళ్లు జంక్షన్ సమీపంలో శుక్రవారం రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ బాలికకు గాయాలయ్యాయి. శ్రీకాకుళం నగరానికి చెందిన పి.నర్సింహమూర్తి కారులో శ్రీకాకుళం వైపు వెళ్తుండగా, వెనుక నుంచి వస్తున్న ఒడిశాకు చెంది న కారు ఢీకొంది. ఈ ఘటనలో ముందు కారులో ఉన్న బాలికకు గాయాల య్యాయి. ఈ మేరకు ఎచ్చెర్ల పోలీసులకు ఫిర్యాదు అందింది.
వైసీసీ నాయకుడిపై దాడి
ఇచ్ఛాపురం, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): మండపల్లి గ్రామానికి చెందిన వైసీసీ నాయకుడు పిట్ట మామయ్యపై ఇద్దరు వ్యక్తులు గురువారం సాయం త్రం దాడి చేశారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఉన్న మాంసం దుకాణం వద్ద తన పరిచయస్తులతో మాట్లాడుతుండగా, బెల్లుపడ కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు తనతో గొడవ పడి ముఖం, చేతులపై పిడిగుద్దులతో గాయపరిచినట్లు మామయ్య శుక్రవారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ముకుందరావు తెలిపారు.
ఫొటో: క్రైం