పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపులేదు
ABN , Publish Date - Jul 18 , 2025 | 11:34 PM
పార్టీ కోసం ముందునుంచి కష్టపడిన వారికి గుర్తింపులేదని, వైసీపీ నుంచి వచ్చిన వారికి పదవులిస్తున్నారని జనసేన కార్యకర్తలు, వీర మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం అర్బన్, జూలై 18 (ఆంధ్రజ్యోతి): పార్టీ కోసం ముందునుంచి కష్టపడిన వారికి గుర్తింపులేదని, వైసీపీ నుంచి వచ్చిన వారికి పదవులిస్తు న్నారని జనసేన కార్యకర్తలు, వీర మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీకాకు ళం జనసేన నేత మామిడి విష్ణు సతీమణి దారపు జ్యోత్స్నకు ఏఎసంపీ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పలు వురు జనసేన నేతలు, కార్యకర్తలు పార్టీ జిల్లా కార్యాలయం ఎదుట ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఆది నుంచి పార్టీ కోసం పని చేసిన వారికి కాకుండా వైసీపీ నుంచి వచ్చిన జ్యోత్స్నకు ఏఎంసీ చైర్‌పర్సన్‌గా నియమించడం తగదని అసంతృప్తి వ్యక్తంచేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పార్టీ జెండా మోసిన వారికి కాకుండా వైసీపీ నుంచి వలస వచ్చిన వ్యక్తికి పట్టం కట్టడం అన్యాయమంటూ వారు నినాదాలు చేశారు. తక్షణం ఆమెను మార్చాలని డిమాండ్ చేశారు. కార్యక్ర మంలో జనసేన పార్టీ కార్యకర్తలు గురు ప్రసాద్, కామేష్, అప్పల రాజు, సాయి, నవీన్, శేఖర్, లక్ష్మి, వెంకీ, విష్ణుప్రియాంక తదితరులు పాల్గొన్నారు.