Share News

ఆ వస్తువులే వారి ఆస్తి

ABN , Publish Date - Oct 01 , 2025 | 12:12 AM

: ఆచారాలు, సంప్రదాయాలకు నిలయంగా నువ్వలరేవు గ్రామం నిలుస్తోంది.

ఆ వస్తువులే వారి ఆస్తి
ఇత్తడి, కంచు సామాన్లు తోముతున్న మహిళలు

- ఇత్తడి, కంచు కుండలు, చెంబులకు పూజలు

- నువ్వలరేవులో కొనసాగుతున్న సంప్రదాయం

వజ్రపుకొత్తూరు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆచారాలు, సంప్రదాయాలకు నిలయంగా నువ్వలరేవు గ్రామం నిలుస్తోంది. పూర్వీకుల నుంచి సంక్రమించిన ఇత్తడి, కంచు కుండలు, చెంబులను తమ ఆస్తిగా ఈ గ్రామస్థులు భావిస్తుంటారు. దసరా, సంక్రాంతి లాంటి పెద్దపండుగల సమయంలో ఇళ్లలోని అటుకులు, బల్లలపై ఉన్న ఆ వస్తువులను కిందకు దించుతారు. వీధిలో ఉన్న అమ్మలక్కలను పిలిచి చింతపండు, కర్రల బుగ్గితో కలపి చక్కగా వాటిని తోముతారు. తరువాత పండుగ నాడు వాటిని పూజించి తిరిగి అటుకులపై పేర్చుతారు. తమ పెద్దల నుంచి వచ్చిన ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ గ్రామస్థులు కొనసాగిస్తుండడం విశేషం. పెళ్లిలకు ఆడపిల్లవారు ఇత్తడి, కంచు సామాన్లను తమ శక్తికొలదీ సారెగా ఇస్తుంటారు. భూములు కొనుగోలుపై ఈ గ్రామస్థులు అంతగా ఆసక్తి చూపరు. బంగారం, ఇత్తడి, కంచు సామగ్రిని కోనుగోలు చేయడానికి ఇష్టపడడం వీరి ప్రత్యేకత. దసరా సందర్భంగా ప్రస్తుతం నువ్వలరేవులో ఏ వీధిలో చూసినా ఇత్తడి, కంచు సామాన్లతో పాటు వారిని తోముతున్న మహిళలే కనిపిస్తున్నారు.

25vkp02.gif

తోమిన వాటిని అరుగులపై ఆరబెట్టిన దృశ్యం

Updated Date - Oct 01 , 2025 | 12:13 AM