ఈ వార్డెన్ మాకొద్దు
ABN , Publish Date - Aug 16 , 2025 | 01:10 AM
ఈ వార్డెన్ మాకొద్దంటూ స్థానిక ప్రభుత్వ ఎస్సీ బాలికల సంక్షేమ వసతి గృహ విద్యార్థినులు ఆందోళన చేశారు.
ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతిగృహ విద్యార్థినుల ఆందోళన
విచారణకు వెళ్లిన అధికారులను అడ్డుకున్న వార్డెన్
పోలీసుల సాయంతో లోపలకు వెళ్లిన వైనం
పాతపట్నం ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): ఈ వార్డెన్ మాకొద్దంటూ స్థానిక ప్రభుత్వ ఎస్సీ బాలికల సంక్షేమ వసతి గృహ విద్యార్థినులు ఆందోళన చేశారు. స్థానిక ఎస్సీ బాలికల వసతిగృహంలో వాచ్‌మన్(మహిళ)పై వార్డెన్ సుశీల దాడిచేయడంతో శుక్రవారం అలజడి నెలకొంది. ఈ నేపథ్యంలో బాలిక లు అధికారులకిచ్చిన సమాచారం మేరకు కలెక్టర్ ఆదేశాలతో తహసీల్దార్ నందిగామ ప్రసాదరావు, ఇతర అధికారులతో కలిసి వసతిగృహాన్ని సందర్శిం చేందుకు శుక్రవారం సాయంత్రం వచ్చారు. అయితే సెలవురోజున విజిట్ చేయడాని మీరెవరంటూ సుమారు అరగంటపైబడే లోపలకు రానీయకుండా వాదించారు. దీంతో పోలీసుల సాయంతో తహసీల్దార్ వసతి గృహం లోపలకి వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు. ఈ వార్డెన్ మాకొద్దంటూ విద్యార్థినులు పడు తునన అవస్థలు వివరించారు. వార్డెన్ బూతులు తిడుతుందంటూ వాపోయా రు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి ముందుకొస్తే బెదిరిస్తుందని తెలి పారు. కలెక్టర్, డీడీలకే కాలర్ పట్టుకు అడిగేదానిని మీరెంత అంటూ ఎమైనా ఫిర్యాదు చేస్తే తరువాత ఉంటాది జాగ్రత్త అని హుకుం చెలాయిస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వార్డెన్ మేడం, మనుమల బట్టలు సైతం మాచేతనే ఉతికిస్తుందని, లేకుంటే కొడతారన్నారు. సాయంత్రమైతే చాలు వసతిగృహం నుంచి సరుకులు మూటలుగా బయటకు తరలిపోతున్నాయని తెలిపారు. మెనూ పాటించకుండా రోజూ వంకాయ కూరే పెడుతున్నారన్నారు. మరమ్మతు పనులు కూడా మాచేతే చేయిస్తుంటరన్నారు. వార్డెన్ కారుడ్రైవర్ ఎప్పుడూ హా స్టల్‌లోనే ఉంటాడు. హోస్టల్‌లో మారూములలోనే తిరుగుతూ ఉండడం కొన్ని సార్లు ఇబ్బందిగా ఉంటుందన్నారు. అదే మాపేరెంట్స్ వస్తే లోపలికి కూడా రానీయడం లేదని వాపోయారు. హాస్టల్‌లో ఉండడం చాలా ఇబ్బందిగా ఉంద న్నారు. దీనిపై ఏఎస్‌డబ్ల్యూవో శ్యామలను తహసీల్దార్ ప్రశ్నించగా.. పలుమా ర్లు షోకాజ్ నోటీసులు ఇచ్చినా తిరిగి సమాధానం లేదని, ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఈవార్డెన్ ఉంటే మేము హాస్టల్‌లో ఉండలేమని వెంటనే మార్చేయాలని విద్యార్థినులంతా ఉమ్మడిగా తహసీల్దార్‌ను కోరారు. ఎంపీడీవో పి.చంద్రకుమారి, ఎస్‌ఐ బి.లావణ్య తదితరులు ఉన్నారు.