రౌడీయిజం చేస్తే ఊరుకునే ప్రభుత్వం కాదు
ABN , Publish Date - Aug 08 , 2025 | 11:47 PM
రౌడీయిజం చేస్తామంటే కూటమి ప్రభు త్వం ఎవరి వదలిపెట్టదన్న విషయం వైసీపీ నాయకులు గుర్తెరిగి మెలగాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకట రమణమూర్తి అన్నారు.
కొత్తూరు, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): రౌడీయిజం చేస్తామంటే కూటమి ప్రభు త్వం ఎవరి వదలిపెట్టదన్న విషయం వైసీపీ నాయకులు గుర్తెరిగి మెలగాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకట రమణమూర్తి అన్నారు. శుక్రవారం సాయంత్రం కొత్తూరు విలేకర్లు సమావేశంలో మాట్లాడుతూ.. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్‌రెడ్డి కార్యాలయంలో వైసీపీ రౌ డీలు ఒక దళిత యువకుడిని బంధించి చిదకబాది చిత్రహింసలకు గురిచేయ డమే కాకుండా విడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టి భయపెట్టడం దా రణమన్నారు. కర్లెమ్మ సర్పంచ్ ఎల్.భగవాన్‌దాస్ నాయుడు, టీడీపీ నాయ కులు చోడవరపు జోగినాయుడు, ఎద్దు శ్రీనివాసరావు, మడపాన రాజారావు, గండికోట త్రినాథరావు, మడపాన రాజారావు పాల్గొన్నారు.