పట్టణంలో దొంగల హల్‌చల్
ABN , Publish Date - Dec 06 , 2025 | 12:15 AM
పొందూరులో గురువారం రా త్రి దొంగలు హ ల్‌చల్ చేశారు. తాళాలు వేసి ఉన్న రెండిళ్లలో చోరీకి పాల్పడ్డా రు.
తాళాలు వేసి ఉన్న రెండిళ్లలో చోరీ
పొందూరు, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): పొందూరులో గురువారం రా త్రి దొంగలు హ ల్‌చల్ చేశారు. తాళాలు వేసి ఉన్న రెండిళ్లలో చోరీకి పాల్పడ్డా రు. వివరాలిలా ఉన్నాయి.. పొందూరు పట్టణం గాంధీనగర్‌లో మాడుగుల లక్ష్మి ఇంటిలో చోరీ జరిగింది. తులం బంగారు చైన్, రూ.లక్ష నగదు, వెండి వస్తువులు దొంగిలించారు. గాంధీనగర్ రెండోవీధిలో ఎచ్చెర్ల పైడిరాజు ఇంటిలో దొంగలు ప డి అరతులం బంగారు వస్తువులు, వెండి వస్తువులు దొంగలించారు. శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి ఇచ్చిన సమాచారంతో బాధితులు పోలీసులకు ఫి ర్యాదు చేశారు. ఘటనా స్థలాలను క్లూస్‌టీం సందర్శించి వివరాలు సేకరించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వి.స త్యనారాయణ తెలిపారు.