Share News

సర్కిల్‌ ఆఫీసు నుంచి దొంగ పరారీ!

ABN , Publish Date - Nov 29 , 2025 | 11:44 PM

Thief escapes నరసన్నపేటలోని సర్కిల్‌ ఆఫీసు నుంచి ఓ దొంగ పరారీ అయినట్టు తెలుస్తోంది. మూడు రోజుల కిందట ఈ ఘటన జరగ్గా.. ఆలస్యంగా బయటపడింది. బుడితి గ్రామానికి చెందిన జె.అప్పలనాయుడు.. నరసన్నపేట పాతబస్టాండ్‌లోని ఓ సిమెంట్‌ షాపులోకి ఈ నెల 21న మధ్యాహ్నం 3 గంటలకు వెళ్లాడు. అక్కడ కౌంటర్‌లో ఉన్న రూ.85వేల వరకు నగదు చోరీ చేశాడు.

సర్కిల్‌ ఆఫీసు నుంచి దొంగ పరారీ!

మూడు రోజులు క్రితం సంఘటన

ఆలస్యంగా బయటపడిన వైనం

స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చామంటున్న సీఐ

నరసన్నపేట, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): నరసన్నపేటలోని సర్కిల్‌ ఆఫీసు నుంచి ఓ దొంగ పరారీ అయినట్టు తెలుస్తోంది. మూడు రోజుల కిందట ఈ ఘటన జరగ్గా.. ఆలస్యంగా బయటపడింది. బుడితి గ్రామానికి చెందిన జె.అప్పలనాయుడు.. నరసన్నపేట పాతబస్టాండ్‌లోని ఓ సిమెంట్‌ షాపులోకి ఈ నెల 21న మధ్యాహ్నం 3 గంటలకు వెళ్లాడు. అక్కడ కౌంటర్‌లో ఉన్న రూ.85వేల వరకు నగదు చోరీ చేశాడు. ఈ విషయాన్ని గమనించి ఒక వ్యక్తి కేకలు వేయగా పారిపోయేందుకు యత్నించాడు. స్థానికులు ఆయనను పట్టుకుని నరసన్నపేట పోలీసులకు అప్పగించారు. అప్పలనాయుడు గతంలో ఇదే మాదిరిగా అదే సిమెంట్‌ షాపులో నాలుగు సార్లు చోరీకి పాల్పడి సుమారు రూ.5 లక్షల వరకు ఎత్తుకెళ్లినట్లు తేలింది. దీంతో షాపు యాజమాని అదే రోజు నరసన్నపేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టేందుకు పోలీసులు నిందుతుడ్ని పిలిచారు. పలు కేసులపై విచారణ, శాస్త్రీయపరమైన ఆధారాల కోసం సర్కిల్‌ కార్యాలయంలోని గదిలో ఉంచారు. అప్పలనాయుడు మూడు రోజుల కిందట తెల్లవారుజామున బాత్‌రూమ్‌కు వెళ్లినట్లు నటించి.. కార్యాలయం బయట ఉన్న హోంగార్డు దిచక్రవాహనం చోరీ చేసి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు మూడు రోజులుగా నిందితుడు కోసం నరసన్నపేట సర్కిల్‌ సిబ్బంది గాలిస్తున్నారు. పోలీసుల కళ్లుకప్పి నేరస్థుడు పరారీ కావడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై సీఐ ఎం.శ్రీనివాసరావు వద్ద ప్రస్తవించగా విచారణ చేపట్టడం వాస్తవమేనని.. నిందుతుడ్ని 41ఏ స్టేషన్‌బెయిల్‌ ఇచ్చి పంపించామని తెలిపారు.

Updated Date - Nov 29 , 2025 | 11:44 PM