Share News

శిథిల భవనం తొలగించరు.. కొత్తది పూర్తి చేయరు

ABN , Publish Date - Jul 25 , 2025 | 11:50 PM

మండలంలోని కొమరల్తాడ అంగన్‌వాడీకేంద్రం భవనం శిథిలావస్థకు చేరింది.శిథిలావస్థకు చేరిన భవ నం తొలగించకపోవడంతోపాటు నిర్మాణంలోఉన్న భవనం పూర్తి చేయక పోవడం వల్ల కేంద్రం నిర్వహణకు అవస్థలు తప్పడం లేదు. జనావాసా ల్లో ఉన్న ఈభవనం ఎప్పుడు కూలుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రు ల్లో భయాందోళన నెలకొంది.

శిథిల భవనం తొలగించరు.. కొత్తది పూర్తి చేయరు
కొమరల్తాడలో భవనం పనులు అర్థాంతరంగా నిలిచిపోయిన దృశ్యం :

వజ్రపుకొత్తూరు, జూలై 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొమరల్తాడ అంగన్‌వాడీకేంద్రం భవనం శిథిలావస్థకు చేరింది.శిథిలావస్థకు చేరిన భవ నం తొలగించకపోవడంతోపాటు నిర్మాణంలోఉన్న భవనం పూర్తి చేయక పోవడం వల్ల కేంద్రం నిర్వహణకు అవస్థలు తప్పడం లేదు. జనావాసా ల్లో ఉన్న ఈభవనం ఎప్పుడు కూలుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రు ల్లో భయాందోళన నెలకొంది. ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాన్ని పాత పాఠ శాల భవనంలో నిర్వహిస్తున్నారు. ఆభవనం శ్లాబ్‌ పెచ్చులూడుతుండ డంతో పలుసార్లు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో పాతభవనానికి సమీపంలో మరోభవనం నిర్మాణానికి పునా దుల వేసి ఏళ్లుగడుస్తోంది.ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన భవనాన్ని ఖాళీ చేయించి కనీసం అద్దె భవనంలో తరగతులు నిర్వహించాలని కోరుతున్నా అధికారులు చర్యతీసుకోవడంలేదని విద్యార్థులతల్లిదండ్రులు చెబుతున్నా రు. కాగా అధికారులు దృష్టికి ఎన్నిసార్లు ఈ సమస్య తీసుకువెళ్లినా స్పం దించడంలేదని సర్పంచ్‌ చింతరాజు తెలిపారు.మండల సమావేశాల్లోనూ అంగన్‌వాడీ కేంద్రం భవనం సమస్య ప్రస్తావించినట్లు చెప్పారు.

Updated Date - Jul 25 , 2025 | 11:50 PM