తలుపులు ఊడి.. గోడలు బీటలు వారి
ABN , Publish Date - Dec 03 , 2025 | 12:00 AM
మండలంలోని అక్కు పల్లి తుపాన్ రక్షిత భవనం శిథిలావస్థకు చేరుకొంది. 15 ఏళ్ల కిందట ఎన్‌సీఆర్‌ఎంపీ నిధులతో నిర్మించిన ఈ భవనం నిర్వహణ లోపం వల్ల మరమ్మతులు లేక తలుపులు ఊడిపోవడంతోపాటు, గోడలు బీటలు వారాయి. శ్లాబు పెచ్చులూడుతుండడంతో భవనాన్ని అధికారులు మూసి వేశారు.
వజ్రపుకొత్తూరు, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అక్కు పల్లి తుపాన్ రక్షిత భవనం శిథిలావస్థకు చేరుకొంది. 15 ఏళ్ల కిందట ఎన్‌సీఆర్‌ఎంపీ నిధులతో నిర్మించిన ఈ భవనం నిర్వహణ లోపం వల్ల మరమ్మతులు లేక తలుపులు ఊడిపోవడంతోపాటు, గోడలు బీటలు వారాయి. శ్లాబు పెచ్చులూడుతుండడంతో భవనాన్ని అధికారులు మూసి వేశారు. తుఫాన్లు, ప్రకృతివైపరీత్యాల సమయంలో గ్రామంలో నివసి స్తున్న 1,500 మందికి షెల్టర్‌కోసం నిర్మించారు. తీరానికి అరకిలోమీటరు దూరంలోఉన్న ఈగ్రామం తుఫాన్ ప్రభావితగ్రామాల జాబితాలో ఉంది. ఇక్కడ భవనం శిథిలావస్థకు చేరడంతో తుఫాన్ల సమయంలో బైపల్లిలోని మల్టీపర్సస్ భవనంలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాల్సివస్తోంది. దీనికితోడుఅక్కుపల్లి తుపాన్ రక్షిత భవనం ఇక్కడి ఉన్నత పాఠశాల మైదానం మధ్యలో నిర్మించారు.పాఠశాల విద్యార్థులు ఆడుకునే సమయం లో అటుగా భవనంలోకి వెళ్లే ప్రమాదాలు జరుగుతాయోనని తల్లిదం డ్రులు ఆందోళనచెందుతున్నారు. గ్రామసచివాలయం కూడా తుఫాన్ షెల్టర్‌కు ఆనుకునేఉంది. సిబ్బందితోపాటు కార్యాలయానికి పనుల నిమిత్తం వచ్చే వారంతా శిథిలావస్థకు చేరిన భవనం చూసి ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈతుఫాన్ షెల్టర్‌లోనే గతంలో ఉన్నతపాఠశాల తరగ తులతోపాటు పదోతరగతి పరీక్ష కేంద్రాన్ని కూడానిర్వహించిన విషయం విదితమే. తక్షణమే అధికారులు స్పందించి భవనానికి మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు.