Share News

ఉద్యోగాలిప్పిస్తామంటూ..

ABN , Publish Date - Jul 11 , 2025 | 12:31 AM

ఉద్యోగాలిప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసిన ఓ మహిళ తనపై హత్యాహత్నం జరిగిందంటూ చేసిన ప్రచా రం కలకలం రేపింది.

ఉద్యోగాలిప్పిస్తామంటూ..

  • ఇద్దరు వ్యక్తుల నుంచి డబ్బులు వసూలు చేసిన మహిళ

  • ఎన్నాళ్లయినా ఇవ్వకపోవడంతో నిలదీసిన బాధితులు

  • తనపై హత్యాహత్నం చేశారంటూ మహిళ హల్‌చల్‌

పాతపట్నం, జూలై 10(ఆంధ్రజ్యోతి): ఉద్యోగాలిప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసిన ఓ మహిళ తనపై హత్యాహత్నం జరిగిందంటూ చేసిన ప్రచా రం కలకలం రేపింది. ఎస్‌ఐ బి.లావణ్య తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. సదరు మహిళ పాతపట్నం సహారవీధిలో నివాసం ఉంటోంది. ఈ మహిళ భర్త కర్నూలులో సెర్ప్‌లో పనిచేస్తున్నారు. ఒడిశాకు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి సెరీకల్చర్‌లో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిపై ఉద్యోగాలిప్పిస్తానంటూ ఈమె రూ.1.50 లక్షలు తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే కాలం గడుస్తున్నా ఉద్యోగాలివ్వకపోగా.. డబ్బులు కూడా వెనక్కి ఇవ్వకపోవడంతో ఆ ఇద్దరు వ్యక్తు లు సదరు మహిళ ఇంటికి వెళ్లి నిలదీశారు. దీంతో తనపై వారు హత్యాహత్నం చేశారంటూ ఆమె హల్‌చల్‌ చేసింది. పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాల పరిశీలన అనంతరం కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Jul 11 , 2025 | 12:31 AM