Share News

నిద్రమాత్రలు ఇచ్చి.. చంపేశారు

ABN , Publish Date - Aug 15 , 2025 | 12:17 AM

ప్రియుడి మోజులోపడి ఓ మహిళ భర్తనే హత్య చేసిన ఘటన పాతపట్నంలో చోటుచేసుకుంది.

నిద్రమాత్రలు ఇచ్చి.. చంపేశారు
వివరాలు వెల్లడిస్తున్న టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు

  • భర్తను హత్య చేసిన మహిళ

  • సహకరించిన ప్రియుడు, మరొకరు

  • నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

పాతపట్నం ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ప్రియుడి మోజులోపడి ఓ మహిళ భర్తనే హత్య చేసిన ఘటన పాతపట్నంలో చోటుచేసుకుంది. ఈ నెల 7న నమోదైన అనుమానాస్పద కేసును పాతప ట్నం పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్టు చేసి, నేరానికి వినియోగించిన నాలుగు సెల్‌ఫోన్లు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. గురువారం టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఈ వివరాలను వెల్లడించారు. నల్లి రాజుకు మౌనికతో ఎనిమిదేళ్ల కిందట వివాహ మైంది. వీరికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. మౌనిక కు స్థానిక మాదిగవీధికి చెందిన గుండు ఉదయ్‌ కుమార్‌తో వివాహేతర సంబంధం ఉంది. దీంతో రాజు, మౌనిక మధ్య తరచూ తగాదాలు జరుగు తుండేవి. రాజును అంతంచేయాలని, అలాగే మౌనిక ప్రియుడు ఉదయ్‌ కూడా తన భార్యకు విడాకులిచ్చి ఎక్కడికైనా వెళ్లి వివాహం చేసుకోవా లని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. దీంతో రాజును హత్య చేసేందుకు పథకం వేశారు. ఇందులో భాగంగా ఉదయ్‌ కొత్త ఫోన్‌ నెంబరుతో రెండు నెలలుగా రాజుతో అమ్మాయిలా మాట్లాడుతూ.. వాట్సాప్‌లో చాటింగ్‌ చేస్తుండేవాడు. ఏకాంత ప్రదేశానికి రప్పించి రాజును హత్య చేయాలని అనుకున్నాడు. పలుమార్లు ప్రయత్నాలు చేసినా.. రాజు వెళ్లకపోవడంతో వారి పథకం విఫలమైంది. దీంతో ఇంటిలోనే రాజును చంపేం దుకు పథకం వేశారు. నిద్ర మాత్రలిచ్చి, మత్తులోకి జా రుకున్నాక చంపాలని కుట్ర పన్నారు. ఇందుకోసం ఉదయ్‌ తనబావ మల్లికా ర్జున సహాయం కోరాడు. ఉదయ్‌ పర్లాకిమిడిలో ఒక ఆర్‌ఎంపీ వైద్యుడి వద్ద నిద్ర మాత్రలు తెచ్చి మౌనికకు ఇచ్చాడు. హత్య జరిగిన ముందురోజు కూడా మౌనిక తనభర్త రాజుకు నాలుగు మాత్ర లు అన్నంలో పెట్టి ఇచ్చింది. రాజు పూర్తిస్థాయిలో మత్తులోకి వెళ్లకపోవడంతో.. మరుసటిరోజు 6వ తేదీ రాత్రి ఆరు నిద్ర మాత్రలను అన్నంలో కలిపి రాజుకు ఇచ్చింది. అదితిన్న రాజు గాఢ నిద్రలోకి వెళ్లిపోయాడు. ఇదే అదనుగా ఉదయ్‌కు తన ఇంటికి రమ్మని మౌనిక ఫోన్‌ చేసింది. ఉదయ్‌, మల్లికార్జున ముందుగా వీధి లైట్లను ఆపేసి రాత్రి 11.30 గంటల సమయంలో మౌనిక ఇంటికెళ్లారు. మౌనిక, మల్లికార్జున ఇద్దరూ కలిసి రాజు కాళ్లు, చేతులూ పట్టుకోగా.. రాజు ఛాతీపై ఉదయ్‌ కూర్చొని తలగడతో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు.

సినీఫక్కీలో హత్యోదంతం..

హత్యానంతరం రాజు ద్విచక్ర వాహనం, అతడి చెప్పులు, ఒక మద్యం సీసాను తీసుకుని స్థానిక ఎస్సీవీధి దిగువపెట్టి వచ్చారు. ఇటీవలే మద్యం మానేస్తానంటూ రాజు వేసుకున్న కడియాన్ని తీసివేసి అతడి జేబులో పెట్టారు. అలాగే రాజు కట్టుకున్న లుంగీని తీసేసి టీషర్ట్‌, షార్ట్‌ తొడిగారు. ఆ తర్వాత తన స్కూటీపై రాజు మృతదేహాన్ని అప్పటికే ఎస్సీ వీధి శివారున ఉంచిన రాజుకు చెందిన వాహనం వద్ద పడేసి ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. మరుసటిరోజు ఉదయం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు తనభర్త రాత్రి బయటకెళ్లి తిరిగిరాలేదని మౌనిక తన అత్తకు తెలియజేసి.. రాజు మొబైల్‌కు పదేపదే ఫోన్‌ చేసింది. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి చెప్పింది. రాజు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు అతడి కుటుంబ సభ్యులు తెలియ జేశారు. వారు అక్కడికి చేరుకుని రాజు మృతదేహా న్ని పాతపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మౌనిక ఆసుపత్రికి వచ్చి ఎవరికీ అనుమానం రాకుండా ఏడుపు నటిస్తూ తనభర్త మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టం నివే దిక ఆధారంగా రాజుది హత్యగా నిర్ధారించుకుని పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ విషయం తెలుసుకున్న నిందితులు రెవెన్యూ అధి కారి వద్దకు వెళ్లి లొంగిపోయారు. సీఐ వి.రామా రావు, ఎస్‌ఐ బి.లావణ్య, పీసీలు పరమేష్‌, బి.జీవ రత్నం, గౌరీశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 15 , 2025 | 12:18 AM