‘థర్మల్’ ప్రతిపాదనలు రద్దు చేయాలి
ABN , Publish Date - Dec 03 , 2025 | 11:23 PM
థర్మల్ విద్యుత్ సూపర్ క్రిటికల్ పవర్‌ప్లాంట్ ప్రతిపాదనలు తక్షణం రద్దు చేయాలని థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు, ఆదివాసీలు డిమాండ్ చేశారు.
బూర్జ, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): థర్మల్ విద్యుత్ సూపర్ క్రిటికల్ పవర్‌ప్లాంట్ ప్రతిపాదనలు తక్షణం రద్దు చేయాలని థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు, ఆదివాసీలు డిమాండ్ చేశారు. అన్నంపేట పంచాయతీ జంగాలపాడు గ్రామంలో బుధవారం ప్లాంట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు సురేష్‌దొర, కార్యదర్శి సవర సింహాచలం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. థర్మల్ ప్రతులను దహనం చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు సవర లక్ష్మణరావు, నాగేశ్వరరావు, రామ లింగం, మనోజ్, మిన్నారావు, కూర్మారావు పాల్గొన్నారు.