అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:27 AM
మీకోసం కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చే అర్జీలను పరిష్కరించ డంలో అలసత్వం వద్దని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.
- కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): మీకోసం కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చే అర్జీలను పరిష్కరించ డంలో అలసత్వం వద్దని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఆయన జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి 78 వినతులను స్వీకరించారు. సమస్యలు తక్షణ పరిష్కారంపై అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశిం చారు. కార్యక్రమంలో ఉప కలెక్టర్ పద్మావతి, జడ్పీ సీఈవో శ్రీధర్ రాజా, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.