Share News

బోధనా రుసుం చెల్లింపులో జాప్యం తగదు

ABN , Publish Date - Sep 23 , 2025 | 12:05 AM

డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బోధనా రుసుం చెల్లించడంలో జాప్యంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల ప్రతిని ధులు అన్నారు. ఈ మేరకు సోమవారం ప్రైవేటు డిగ్రీ కళాశాలలు బంద్‌ పాటించి డా.బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీ ఎదుట ఆందోళన చేపట్టారు.

బోధనా రుసుం చెల్లింపులో జాప్యం తగదు
ఆందోళన చేస్తున్న ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్య కమిటీ ప్రతినిధులు

వర్సిటీ ఎదుట ప్రైవేటు డిగ్రీ యాజమాన్యాల ఆందోళన

ఎచ్చెర్ల, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బోధనా రుసుం చెల్లించడంలో జాప్యంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల ప్రతిని ధులు అన్నారు. ఈ మేరకు సోమవారం ప్రైవేటు డిగ్రీ కళాశాలలు బంద్‌ పాటించి డా.బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొన్నాన జయరాం మాట్లాడుతూ.. బోధనా రుసుం వెంటనే చెల్లించి కళాశాలలు సజావుగా నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటి వరకు 7 క్వార్టర్లకు సంబం ధించి బకాయిలున్నారన్నారు. దీంతో కళాశాలల నిర్వహణ ఇబ్బందికరం గా మారిందన్నారు. సంఘం ప్రతినిధులు కోట మురళి, దానేటి పద్మజ, బింగు చిట్టిబాబు, ఎం.మోహనరావు, టి.విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 23 , 2025 | 12:05 AM