నష్టపరిహారం చెల్లింపులో జాప్యం తగదు
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:31 AM
మోటార్ వాహన ప్రమాదాల కేసుల్లో బాధితులకు నష్ట పరిహారం చెల్లింపు లో జాప్యం తగద ని జిల్లాన్యాయసేవాధికార సంస్ద కార్య దర్శి కె.హరిబాబు అన్నారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు
శ్రీకాకుళం లీగల్, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): మోటార్ వాహన ప్రమాదాల కేసుల్లో బాధితులకు నష్ట పరిహారం చెల్లింపు లో జాప్యం తగద ని జిల్లాన్యాయసేవాధికార సంస్ద కార్య దర్శి కె.హరిబాబు అన్నారు. గురువారం స్థానిక సంస్థ కార్యాలయంలో సంబంధిత ప్రభుత్వ అధికారులతో సమావేశం ని ర్వహించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో బాధితులకు సహాయం చేయకపోగా నిర్లక్ష్యంగా యాక్సిడెంట్ చేసినవారు వెళ్లిపోవడం సరికాదన్నారు. అలాంటి వారికి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ వి. రామారావు, ఏఎస్‌ఐ పి.ధర్మారావు, రెవెన్యూ అధికారులు ఎం.నాగేంద్ర ప్రసాద్, ఆర్.ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.