Share News

జల్‌జీవన్‌ పనుల్లో జాప్యం తగదు

ABN , Publish Date - Oct 23 , 2025 | 12:17 AM

‘జల్‌జీవన్‌మిషన్‌ పనుల్లో జాప్యం తగదు. అగ్రిమెంట్‌ పూర్తయినా ఇంతవరకు ప్రారంభించని పనుల కాంట్రాక్టులను రద్దు చేస్తాం’ అని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ హెచ్చరించారు.

 జల్‌జీవన్‌ పనుల్లో జాప్యం తగదు
మాట్లాడుతున్న కలెక్టర్‌

- కాంట్రాక్టులను రద్దు చేస్తాం

- కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

కలెక్టరేట్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి):‘జల్‌జీవన్‌మిషన్‌ పనుల్లో జాప్యం తగదు. అగ్రిమెంట్‌ పూర్తయినా ఇంతవరకు ప్రారంభించని పనుల కాంట్రాక్టులను రద్దు చేస్తాం’ అని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ హెచ్చరించారు. కలెక్టర్‌ కార్యాలయంలో బుధవారం ఆయన జేజేఎం పనులపై సమీక్ష నిర్వహించారు. వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. లేకపోతే రీటెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. సురక్షితమైన తాగునీరు అందించే అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈపథకంలో జాప్యం తగదన్నారు. ఇదే చివరి అవకాశమన్నారు. అధికారులు నుంచి అందిన నివేదిక ప్రకారం జిల్లాలో మొత్తం 4,87,307 ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇంకా 2,6,499 కనెక్షన్లు పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఈ నెలాఖరులోగా పనులు వేగాన్ని పెంచకపోతే అధికారులపై కూడా చర్యలు ఉంటాయని అన్నారు. ఈ డిసెంబర్‌ నాటికి పూర్తికావాలని, ఇంజనీరింగ్‌ అధికారులు నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీపీవో భారతి సౌజన్య, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీర్లు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2025 | 12:17 AM